ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతి బాబు నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. దాంతో ఆ తరవాత వరుస నెగిటివ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. అంతే కాకుండా ఓ వైపు విలన్ గా నటిస్తూ మరోవైపు తండ్రి పాత్రలు కూడా చేస్తు ఆకట్టుకుంటున్నారు. సినిమా లైఫ్ పక్కన పెడితే జగపతి బాబు తనకు నచ్చినట్టు ఉంటూ నచ్చినట్టు మాట్లాడే వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది అయినా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం జగపతి బాబుకు ఉండటంతో అతడి రియల్ క్యారక్టర్ ను కూడా ఎంతో మంది ఇష్టపడుతారు.
Advertisement
ఇదిలా ఉంటే జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన 2017లో చాక్ బూవెన్ అనే అమెరికా యువకుడిని వివాహం చేసుకుంది. అయితే అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. జగపతి బాబు ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్ లో ఉండటంతో ఓ అమెరికన్ ను అల్లుడిగా చేసుకోవడం ఏంటని అంతా ముక్కున వేలేసుకున్నారు. అతడు ఉన్న స్థాయికి ఇక్కడే ఓ మంచి అల్లుడు దొరికేవాడు కదా అంటూ చెవులు కొరుక్కున్నారు. దాంతో జగపతి బాబు అమెరికా యువకుడిని అల్లుడిగా ఎందుకు చేసుకున్నాడో చెప్పుకొచ్చాడు. మేఘన అమెరికాలో పీజీ చదువుతున్నప్పుడు బూవెన్ తో ప్రేమలో పడిందట.
Ad
Advertisement
jagapathi babu daughter marriage
ఆ విషయం ఇంట్లో చెప్పిందట. దాంతో జగపతి బాబు నో అని చెప్పకుండా 20 ఏళ్ల తరవాత మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకో అప్పుడు కూడా భాగుంటుందని అనిపిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసాడట. తన ప్రేమపై నమ్మకం ఉన్న మేఘన తండ్రి ప్రశ్నకు సమాధానం ఇచ్చిందట. దాంతో జగపతి బాబు ఆ పెళ్లికి ఒప్పుకున్నాడట.
ఆ తరవాత హైదరాబాద్ లోనే బంధుమిత్రులను పిలిచి జగపతి బాబు అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఇక పెళ్లికి ముందు దగ్గరి సంబందీకులు మేఘనను పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారట. కానీ జగ్గూ కట్నాలకు వ్యతిరేఖి అని కూడా ఆలోచించారట. కానీ చాక్ కుటుంబ సభ్యులతో ఆకట్నాల గోళ లేదు. జగపతి బాబు అడిగినా వాళ్లు వద్దని చెప్పారట.
also read: సెన్సేషనల్ స్టార్ సినిమాలో అతిథిగా “అఖండ”