Telugu News » Blog » సెన్సేషనల్ స్టార్ సినిమాలో అతిథిగా “అఖండ”

సెన్సేషనల్ స్టార్ సినిమాలో అతిథిగా “అఖండ”

by Bunty

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమాకు తమన్ సంగీతం హైలెట్ అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ‘అఖండ’గా అదరగొట్టిన బాలయ్య ఇప్పుడు మరో సెన్సేషనల్ హీరో సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

Advertisement

Advertisement

BALAKRISHNA

BALAKRISHNA

ఇక విషయంలోకి వస్తే సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. బాలకృష్ణ గతంలో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన “పైసా వసూల్” అనే సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండడంతో “లైగర్” సినిమాలో ఓ కీలక పాత్రలో బాలయ్య కనిపించడానికి ఒప్పుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత మేరకు నిజముందో అనే విషయం చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు. మరోవైపు నందమూరి అభిమానుల్లో ‘అఖండ’ విజయం మంచి జోష్ నింపింది. చిత్రబృందం కూడా ఈ విషయంపై సంతోషంగా ఉన్నారు.