జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లకు లైఫ్ వచ్చింది. అప్పటి వరకూ నాటకరంగంలో రానించిన వాళ్లు, సినిమాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కామెడీ షోకు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలా జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై బిజీగా మారిన కమెడియన్ అప్పారావు. తనపై తనే పంచ్ లు వేసుకోవడం….అమ్మాలయిల కలల వీరుడిలా పోజులు కొట్టడం ఇలా అప్పారావు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
Advertisement
జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అప్పారావు ఆ తరవాత ఎన్నో సినిమాలలో నటించారు. అయితే అప్పారావు గత కొంతకాలంగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఈ విషయంపై తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో స్క్రిట్ లు చేశానని చెప్పారు. ఎనిమిదేళ్లపాటూ షూటింగ్ లలో కొనసాగినట్టు తెలిపారు. కానీ తన వయసు కారణంగా కరోనాను దృష్టిలో పెట్టుకుని కొంతకాలం వద్దన్నారని చెప్పారు.
Advertisement
ఆ తవరాత కూడా వాళ్లు తనను పిలవలేదని…చెప్పుడు మాటల వల్లనే తనను హోల్డ్ లో పెట్టారని అప్పారావు ఆరోపించారు. కానీ తనకు ఎక్కడా రిమార్క్ లేదని చెప్పారు. స్కిట్ ప్రాధాన్యత లేని పాత్రలు చేయమన్నా కూడా చేశానంటూ అప్పారావు ఎమోషనల్ అయ్యారు.
అక్కడ తన మర్యాద తగ్గుతున్నట్టుగా అనిపించిందని….అది అవమానంగా బాధగా అనిపించి తప్పుకోక తప్పలేదని చెప్పారు. కామెడీ స్టార్స్ లో డబుల్ పేమెంట్స్ ఇస్తున్నారని ఇప్పుడు తన పరిస్థితి భాగుందని చెప్పారు. అంతే కాకుండా ముక్కు అవినాష్ జబర్దస్త్ నుండి బిగ్ కు వెళ్లడానికి డబ్బులు కట్టాల్సివచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా మంది జబర్దస్త్ కమెడిషన్ లు షోను వీడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
చిరంజీవి ఆచార్య సినిమా డైలాగ్స్ చూస్తే..”గూస్ బంప్స్” పుట్టాల్సిందే..!!
ఈ 6 స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లు…!