Home » ఈ 6 స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లు…!

ఈ 6 స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లు…!

by AJAY
Ad

సినిమాల్లో హిట్లు ప్లాపులు సహజం. అయితే హిట్ సినిమాల గురించి ప్రేక్షకులు ఎక్కువగా పట్టించుకుంటారు కానీ డిజాస్టర్ గా నటించిన సినిమాల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే టాలీవుడ్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోల సినిమాల్లో అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఏవి అంటే కొన్ని సినిమాలు గుర్తుకువస్తాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం……

Advertisement

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి.

నితిన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ లై. ఈ సినిమా నితిన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించగా అతి పెద్ద డిజాస్టర్ గా కూడా నిలిచింది.

Advertisement

రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మాణంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా కూడా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ సినిమాలలో స్థానం దక్కించుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా కూడా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా కూడా టాప్ టెన్ అట్టర్ ఫ్లాప్ సినిమాలలో చోటు సంపాదించుకుంది.

Visitors Are Also Reading