Home » ఏఎన్ఆర్ చేసినట్టు నాగార్జున కుమారుల విషయంలో అలా చేయడం లేదా ?

ఏఎన్ఆర్ చేసినట్టు నాగార్జున కుమారుల విషయంలో అలా చేయడం లేదా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం అంటే మాములు విషయం కాదు.. ఎంతటి స్టార్ హీరో అయినా సరైన స్క్రిప్ట్ లు ఎంచుకోవడం, సరైన సినిమాలను తీసి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించటం ఈ రోజుల్లో చాలా కష్టం అనే చెప్పాలి. అక్కినేని నాగార్జునకు మాత్రం ఈ విషయంలో ఏఎన్ఆర్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఏఎన్ఆర్ ఒకప్పుడు టాప్ హీరోగా కొనసాగారు. అప్పట్లో ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే వారు. ఇక కుటుంబ కథా చిత్రాలు, ముఖ్యంగా విషాదాంత ప్రేమ కథల్లో జీవించే వారు ఏఎన్ఆర్.

Advertisement

తనకు తగ్గ కథలను ఎంచుకొని.. డ్యాన్స్ లతో ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా ఏఎన్ఆర్ నిలిచారు. ఆ తరువాత కెరీర్ తొలినాళ్లలలో నాగార్జునకు అంత గుర్తింపు రావడంలో ఏఎన్ఆర్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. సినిమా స్క్రిప్ట్ లు, దర్శకులు ఇత వ్యవహారాలన్నింటిని తానే దగ్గరుండి ఫైనల్ చేసేవారు. దీంతో నాగార్జున వరుస హిట్ సినిమాలతో తండ్రి కలలను నెరవేర్చడంలో సఫలీకృతుడయ్యాడు. ఇక గ్రీకువీరుడిగా అమ్మాయిల డ్రీమ్ హీరోగా ఆయన పేర్గాంచాడు. ఆరు పదుల వయస్సులో కూడా ఇప్పటికీ చాలా యంగ్ గా, పూర్తి ఫిట్ గా కనిపిస్తుంటారు నాగార్జున. అయితే తన కుమారులు నాగచైతన్య, అఖిల్ విషయంలో ఆయన సరిగ్గా పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ నాగార్జున కుమారులుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పటికీ చాలా ఏళ్లు గడిచాయి.

Advertisement

స్టార్ దర్శకులు సైతం వారితో సినిమాలను తెరకెక్కించారు. ఇండస్ట్రీ హిట్ అనిపించే సినిమా మాత్రం ఇప్పటివరకు వారి నుంచి రాలేదు. ఫీల్ గుడ్ సినిమాలతో నాగచైతన్య కాస్త పర్వాలేదనిపించాడు. కానీ అఖిల్ మాత్రం తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క హిట్ సాధించలేకపోయాడు. నాగార్జున ఫేమ్ కి తగినట్టు మాత్రం వారు పేరు సంపాదించలేకపోతున్నారు. ఇందుకు కారణం నాగార్జుననే అని చాలా మంది భావిస్తున్నారు. తన కెరీర్ విషయంలో తండ్రి ఏఎన్ఆర్ ఎంత శ్రద్ధ పెట్టారో అందులో సగం కూడా తన కుమారులపై నాగార్జున శ్రద్ధ పెట్టడం లేదని సినీ ప్రియులు భావిస్తున్నారు. ముందు ముందు అయినా మంచి కథలు ఎంచుకోవడంలో వైవిద్యమైన స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఇద్దరూ కుమారులకు సాయపడాలని నాగార్జునకు సూచిస్తున్నారు. ప్రధానంగా కుమారుల విషయంలో శ్రద్ధ తీసుకుంటేనే ఇండస్ట్రీలో వారు తరువాత జనరేషన్ కి స్టార్ హీరోలు అవుతారని విశ్లేషకులు భావించడం విశేషం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading