Home » మీ ఆధార్ కార్డు నకిలీదా..? కాదా..? అని తెలుసుకోవడం ఎలాగో తెలుసా ?

మీ ఆధార్ కార్డు నకిలీదా..? కాదా..? అని తెలుసుకోవడం ఎలాగో తెలుసా ?

by Anji
Ad

ప్రస్తుతం ప్రతీ అవసరానికి ఆధార్ కార్డు చాలా అవసరం అయింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగానికైనా అవసరమే. సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. బ్యాంకు అకౌంట్ కి ఇలా చెప్పుకుంటే పోతే దేనికైనా అవసరమే.  ఆధార్ 12 అంకెల సంఖ్య భారతీయ పౌరులందరికీ గుర్తింపు రుజువుగా పని చేస్తుంది.  మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే అది అసలైనదా? నకిలీదా అని తనిఖీ చేయడం చాలా ముఖ్యం.  ఒకవేళ మీ ఆధార్ కార్డు నకిలీది అయితే చాలా సమస్యలు తలెత్తే అవకాశముంది. అయితే  ఆధార్‌ నకిలీదా.. కాదా అని ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఎలా  వెరిఫై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఆధార్ కార్డుని ఆన్ లైన్ లో ధృవీకరించే పద్దతి : 

Advertisement

  • తొలుత UIDAI వెబ్ సైట్ కి వెళ్లండి.
  • ఇక్కడ My Aadhar ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఆ తరువాత సర్వీస్ ఎంపిక చేసుకొని ఆధార్ నెంబర్ ధృవీకరించండి. 
  • ఆ తరువాత మీ ఆధార్ నెంబర్, క్యాప్ఛా ఎంటర్ చేయండి.
  • ఇప్పుడు వెరిఫై ఆధార్ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డు నిజమైనదే అయితే అది వెబ్ సైట్ లో EXISTS అని చూపిస్తుంది.
  • ఒకవేళ అది ఫేక్ అయితే ఎర్రర్ మెసేజ్ అని కనిపిస్తుంది.

ఆధార్ కార్డుని ఆఫ్ లైన్ లో ధృవీకరించే పద్దతి : 

మీరు ఆధార్ కార్డ్‌లోని డిజిటల్ సంతకాన్ని ధృవీకరించడానికి QR కోడ్ స్కానర్‌ని ఉపయోగించవచ్చు. లేదా మీరు m Aadhaar యాప్ ద్వారా కార్డును ప్రామాణీకరించవచ్చు. ఈ పద్ధతులు త్వరగా, సులభంగా ఉంటాయి. మీ ఆధార్ కార్డ్ నిజమైనదని, అవసరమైన ఏవైనా సేవలకు అంగీకరించబడుతుందని నిర్ధారించుకోండి.

Visitors Are Also Reading