మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు. రాజమౌళికి బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ లభించక ముందే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మగధీర చిత్రం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రంగా నిలిచి ఎన్నో రికార్డులను సృష్టించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు రూ.35కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. రాజకీయాల్లో ఉన్న చిరంజీవి ఈ చిత్రంలో బంగారు కోడిపెట్ట సాంగ్‌లో కామియో రోల్‌లో కనిపించారు.
Advertisement
ఈ సినిమాకు ఉత్తమ కొరియో గ్రాఫర్‌గా శివశంకర్ మాస్టర్ జాతీయ పురస్కారానని అందుకున్నారు. ఈ చిత్రానికి పని చేసిన విజువల్ ఎఫెక్ట్ టీమ్ కూడా నేషనల్ అవార్డును కైవలం చేసుకోవడం విశేషం. ఛత్రపతి శివాజీకి ప్రాణ మిత్రుడైన తానాజీ మాలుసురేకి సంబంధించిన మరాఠీ చిత్రాన్ని చూసిన రచయితకి ఓ ఐడియా వచ్చిందట. చనిపోయిన అంగరక్షకుడు మళ్లీ జన్మించి పగను తీర్చుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రతిరూపంగా.. ఇందులో కాలభైరవుడి పాత్ర. 100 మందిని చంపి గానీ తాను చావడన్న లాజిక్‌తో ఈక్యారెక్టర్‌ని డిజైన్ చేశారట విజయేంద్ర ప్రసాద్. అదేవిధంగా 1976లో విడుదలైన సూపర్ హిట్ కన్నడ చిత్రం రాజ నన్న రాజు చిత్రాన్ని చూసిన విజయేందర ప్రసాద్ అందులోని పునర్జన్మ కాన్సెప్ట్ తనకు బాగా నచ్చడంతో ఆదిశగా కథను అల్లారట.
Advertisement
Also Read : తెలుగులో అత్యధిక కలెక్షన్ లు రాబట్టిన 6 డబ్బింగ్ సినిమాలు ఇవే..!
వాస్తవానికి మగధీర సినిమా 1996లోనే రావాల్సి ఉంది. ఒక మరాఠి సినిమాలో ఛత్రపతి శివాజీని కాపాడడానికి తన కమాండర్ అయిన తన్హాజీ కి మొగలులతో విరోచితంగా పోరాటం జరిగేది. ఒకటి, రెండు, మూడు అనుకుంటూ చాలా మందిని చంపుకుంటూ వెళ్లి చివరికీ తాను కూడా చనిపోయే స్థితిని చూసి ఇన్‌స్పైర్ అయి విజయేంద్రప్రసాద్ ఒక కథను రాశారట. ఆ కథనే 1996లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన జగదేక వీరుడు ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ సాగర్‌కి వినిపించారట. నచ్చకపోవడంతో వేరే స్టోరీతో ప్రోసీడ్ అయ్యారు. విజయేంద్ర ప్రసాద్ స్టోరీలో అప్పటి జన్మలో రాజమాత క్యారెక్టర్ ఉండగా.. ఈ జన్మలో ఆమె చీఫ్ మినిస్టర్ అవ్వడానికి పోటీ చేస్తుంది. ఆమెను కాపాడడానికి హీరో అయిన బాడీగార్డు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ స్టోరీ ఉండదు. మరీ మగధీర సినిమాలో ఏమో రాజకుమారిగా మాడిఫై చేసి క్యారెక్టరైజేషన్ మార్చి లవ్ ఎలిమెంట్‌ని కలిపారు. ఇవే కాకుండా ఇంకా చాలా చేంజ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు రాజమౌళి.
Also Read : సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గన్ సహా టాలీవుడ్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!