Telugu News » Blog » సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గన్ సహా టాలీవుడ్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!

సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గన్ సహా టాలీవుడ్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!

by AJAY
Ads

ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమాలో చిన్న పాత్ర చేసినా కూడా చాల‌ని టాలీవుడ్ మరియు ఇత‌ర సౌత్ స్టార్స్ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్ర‌లు వచ్చినా బాలీవుడ్ స్టార్స్ సైతం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ లు టాలీవుడ్ హీరోల పై త‌మ క్ర‌ష్ ను ఓపెన్ గా భ‌య‌ట‌పెడుతున్నారు.

Advertisement

దానికి కార‌ణం ప్ర‌స్తుతం టాలీవుడ్ దేశంలోనే నంబర్ వ‌న్ స్థానంలో ఉండ‌టమే. ఇక తాజాగా చిరంజీవి హీరోగా న‌టించిన గాఢ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. నిజానికి స‌ల్మాన్ భాలీవుడ్ కే బాద్షా కానీ చిరంజీవితో అత‌డికి ఉన్న అనుబంధం వ‌ల్ల గాఢ్ ఫాద‌ర్ ఆఫర్ వ‌చ్చిన వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి న‌టించారు.

salman khan

salman khan

అంతే కాకుండా రీసెంట్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్ గ‌న్ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చ‌ర‌ణ్ తండ్రి పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ హీరోయిన్ గా న‌టించి అద‌ర‌గొట్టింది.

Advertisement

ఆ త‌ర‌వాత తాను హీరోయిన్ గా న‌టించిన గంగూబాయ్, బ్ర‌హ్మాస్త్ర సినిమాల‌ను తెలుగులో సైతం రిలీజ్ చేసింది. అంతే కాకుండా చిరంజీవి హీరోగా న‌టించిన మరో సూప‌ర్ హిట్ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డిలో అమితాబ‌చ్చ‌న్ ముఖ్యమైన పాత్ర‌లో నటించారు.

ఈ సినిమాలో అమితాబ్ న‌టించ‌డంతో సినిమాకు ఎంతో ప్ల‌స్ అయ్యింది. సైరా కంటే ముందు చిరంజీవి అక్కినేని ఫ్యామిలీ మొత్తం న‌టించిన మ‌నం సినిమాలోనూ అమితాబ్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించాడు.

Advertisement

అంతే కాకుండా బాలీవుడ్ సినిమాల‌లో ఎంట్రీ ఇచ్చిన ఫారెన్ బ్యూటీ స‌న్నీలియోన్ కూడా టాలీవుడ్ సినిమాల్లో న‌టించింది. స‌న్నిలియోన్ కరెంట్ తీగ సినిమాలో ముఖ్యమైన పాత్ర‌లో న‌టించింది. అంతేకాకుండా మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న జిన్నా సినిమాలోనూ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది.  అదేవిధంగా మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్ళు సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్యమైన పాత్రలో నటించారు.