Home » తెలుగులో అత్యధిక కలెక్షన్ లు రాబట్టిన 6 డబ్బింగ్ సినిమాలు ఇవే..!

తెలుగులో అత్యధిక కలెక్షన్ లు రాబట్టిన 6 డబ్బింగ్ సినిమాలు ఇవే..!

by AJAY
Ad

క#$రోనా మహమ్మారి మరియు ఓటిటిలు థియేటర్ వ్యవస్థ పై ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. దాంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. సినిమాలకు కలెక్షన్లు కూడా తక్కువే వస్తున్నాయి. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ వసూళ్లను సాధించాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Advertisement

కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్-2 కూడా మంచి విజయం సాధించింది. ఈ పాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ -2 కన్నడ సినిమా అయినప్పటికీ భారీ కలెక్షన్లను రాబట్టింది.

లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ తమిళ చిత్రం తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది.

ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన గంగుబాయి సినిమా కూడా మంచి విజయం సాధించింది. గంగుబాయి హిందీ సినిమా అయినప్పటికీ తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టింది.

Advertisement

విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బీస్ట్. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది కానీ విజయ్ కి ఉన్న క్రేజ్ మరియు సినిమా ట్రైలర్ బాగుండడంతో ఈ సినిమాకు కూడా తెలుగులో మంచి కలెక్షన్లు వచ్చాయి.

అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం వాలిమై ను కూడా తెలుగులో విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సైతం తెలుగులో మంచి కలెక్షన్లు వచ్చాయి.

రన్బీర్ కపూర్ అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది.

శివ కార్తికేయన్ హీరోగా నటించిన తమిళ సినిమా డాన్. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి కూడా భారీ కలెక్షన్ లు వచ్చాయి.

Visitors Are Also Reading