సాధారణంగా భారతదేశంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. ఏదైనా పని చేసే ముందు ఎవరైనా తుమ్మినా, లేదంటే పిల్లి అడ్డం వచ్చినా,బల్లి వచ్చిన దాన్ని అపశకునంగా భావిస్తారు.. ఇవే కాకుండా శకున శాస్త్రం ప్రకారం తరచూ ఇలాంటి పనులు మన జీవితంలో ఎదురైతే మనకు ఏదో నష్టం జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read;నిజమేనా:పవన్ కళ్యాణ్ వేసుకున్న ఈ షూస్ ధరతో సామాన్యుడి జీవితం సెట్ అయిపోద్ది..!!
శకున శాస్త్రం ప్రకారం మనం తినే ఆహారంలో తరచు వెంట్రుకలు కనిపిస్తే విస్మరించ కూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. తినే ఆహారంలో తరచుగా జుట్టు రాలడం అనేది చెడు సాంకేతికానికి దారితీస్తుందని అంటారు. ఈ విధంగా రోజు జరిగినట్లయితే మీ జీవితంలో డబ్బు, ఇతర నష్టాలు జరిగే అవకాశం ఉందట. అలా జరిగినప్పుడు మనం ఆహారాన్ని తినకూడదు. ఆహారాన్ని తీసుకెళ్లి ఆవు లేదా మేకలకు పెట్టాలని శాస్త్ర నిపుణులు అంటున్నారు.
Advertisement
ఆహారంలో వెంట్రుకలు రావడం అనేది అశుభశకునంగా భావిస్తారు. అలా తరచూ జరిగినట్లయితే చెడు రాహుకు సంకేతం అని శకున శాస్త్ర నిపుణులు అంటున్నారు. దీని కారణంగా అనేక రకాల నష్టాలు వస్తాయని, ఆర్థిక పురోగతి దెబ్బతీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు చేతిలో నిలవదని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం తినే సమయంలో వెంట్రుకలు వచ్చినట్లయితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు..
also read:Oct 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!