Home » Oct 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Oct 2nd 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

modi

గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సరస్వతి దేవి అలంకరణ లోని అమ్మవారిని వీక్షించేందుకు అర్ధరాత్రి నుండి భక్తులు తరలివస్తున్నారు. దాంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కేసిఆర్ సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీన కొత్త పార్టీ భారతీయ రాష్ట్రీయ సమితిని ప్రకటిస్తారని కొందరు భావిస్తుండగా… మరి కొంతమంది టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తారని ప్రచారం చేస్తున్నారు.

నేడు సీఎం కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, 33 జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం ప్రగతి భవన్ లో మీటింగ్ జరగనుంది. జాతీయ పార్టీపై సమావేశంలో చర్చలు జరిపే అవకాశం ఉంది.

Advertisement

హైదరాబాద్‌ ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్‌ షాపులో మంటలు ఎగసిపడుతున్నాయి. 2 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనున్న షాపులకు మంటల వ్యాపించకుండా సిబ్బంది అదుపు చేస్తున్నారు.

పుదుచ్చేరి వ్యాప్తంగా కరెంట్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. సీఎం రంగస్వామి సహా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంటికి పవర్‌ కట్‌ అయ్యింది. విద్యుత్‌ పంపిణీ, రిటైల్ వ్యవస్థలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె తో ఉత్పత్తి నిలిచిపోయింది.

రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క డిజిపి ని కలిశారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ అనుమతి కోసం వినతి పత్రం ఇచ్చారు. డీజీపీకి రెండు రూట్‌ మ్యాప్‌లు అదజేసిన కాంగ్రెస్‌ నేతలు. చార్మినార్‌ నుంచి గాంధీ నగర్‌, జూబ్లీహిల్స్‌ మీదుగా పటాన్‌ చెరు వైపు రూట్‌మ్యాప్ తయారు చేశారు.

ఏపీకి కేంద్రం నుంచి మొత్తం 11 స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు అందాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2021-22కి గాను 11 కేంద్ర పురస్కారాలు రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

Visitors Are Also Reading