ప్రస్తుతం ఎక్కడ చూసినా కీరవాణి పేరు మారుమోగిపోతోంది..నాటు నాటు పాటతో నమ్మలేనటువంటి అవార్డు సాధించారు కీరవాణి. ఆస్కార్ అవార్డు వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ బహుమతి దక్కడం కీరవాణికి మరియు ఆర్ఆర్ఆర్ టీంకు ఎంతో గౌరవప్రదమైన విషయంగా చెప్పవచ్చు.
Advertisement
అయితే కీరవాణి సాధించిన ఘనతపై వారి కుటుంబ సభ్యులు,మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి అనేక అభినందనలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇదే విషయంపై కీరవాణి తండ్రి శివశక్తి దత్త స్పందించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు..
Also Read:JR:ఎన్టీఆర్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్న బాలయ్య.. కారణమేంటంటే..?
Advertisement
కీరవాణి మూడేళ్ల వయసు నుంచే సంగీతం పట్ల ఇంట్రెస్ట్ చూపించేవాడని, కీరవానికి మొదటి గురువు నేనేనని, నాకు తెలిసిన సంగీతాన్ని నేర్పించాను. కానీ కీరవాణి దాన్ని డెవలప్ చేసుకుంటూ అంచలంచలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. నిజం చెప్పాలంటే సంగీతమే నా కడుపున పుట్టింది. నా సరస్వతి వరపుత్రుడు సాధించాడని ఎంతో సంబరపడ్డాడు శివశక్తి దత్త. అంతేకాకుండా కీరవాణి అనే పేరును ఎందుకు పెట్టానో కూడా చెప్పాడు. విప్రనారాయణ సినిమాలోని “ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన” అనే పాట నాకు చాలా ఇష్టం.
Also Read:91 ఏళ్ల కీరవాణి తండ్రి యంగ్ గా కనిపించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.!!
భానుమతి ఆలపించిన ఈ పాటను లెజెండరీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచారు. ఓ రోజు ఆయనను కలిసినప్పుడు ఆ పాట ఏ రాగం అని అడిగితే కీరవాణి రాగమని చెప్పారు. ఆ టైంలో శివశక్తి భార్య ప్రేగ్నెంట్. దీంతో తనకు కూతురు పుట్టిన కొడుకు పుట్టిన ఈ పేరు పెడతానని ఫిక్స్ అయ్యారట. కానీ కొడుకు పుట్టాడు. దీంతో అమ్మాయి పేరులా ఉండే కీరవాణి పేరును పెట్టేశానని చెప్పారు శివశక్తి దత్త. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:అకస్మాత్తుగా అతడు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోక ఉండరు..!