నందమూరి ఫ్యామిలీ పేరును శిఖర స్థాయిలో నిలిపారు సీనియర్ ఎన్టీఆర్. అప్పటినుంచి ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతోమంది ఆరాధిస్తుంటారు. అలా ఆయన ఫ్యామిలీ నుంచి మంచి గుర్తింపును సాధించిన వారిలో బాలకృష్ణ ఒకరు.. ఇక బాలకృష్ణ తర్వాత నందమూరి ఫ్యామిలీ అంటే గుర్తుకొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. మూడోతరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో గుర్తింపును సాధించారు. పాన్ ఇండియా స్థాయిలో నందమూరి పేరును మార్మోగిలా చేశారు.. ఇంతటి ఘనత సాధించింది సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.
Advertisement
also read;అకస్మాత్తుగా అతడు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోక ఉండరు..!
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో ఎంతోమంది సినీ రాజకీయ నాయకులు త్రిబుల్ ఆర్ యూనిట్ కి విషెస్ తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే బాలకృష్ణ కూడా విషెస్ తెలిపారు. కానీ ఆ పోస్టులో ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆర్ఆర్ఆర్ టీం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రామ్ చరణ్ పేరు ట్యాగ్ చేసి ఎన్టీఆర్ పేరును ట్యాగ్ చేయలేదని నందమూరి అభిమానులు ఒకింత బాధ గురవుతున్నారు.
Advertisement
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు
అలాంటప్పుడు బాలకృష్ణ సొంత అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ట్యాగ్ చేయకుండా కేవలం చిత్ర యూనిట్ కి మాత్రమే విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టడం ఏమాత్రం బాగోలేదని ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణపై విమర్శ చేస్తున్నారు. అంతేకాదు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఎదగడాన్ని ఓరువలేకపోతున్నారని కామెంట్ పెడుతున్నారు. అంతేకాదు తారకరత్న పెద్దకర్మలో కూడా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని పలకరించలేదని, కావాలని జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ సైడ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
also read:వెంకీ సుందరకాండ మూవీ హీరోయిన్ గుర్తుందా..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?