Home » అందుకేనా కృష్ణ మహేష్ ను కాదని నరేష్ తో ఉండేవారు.. అసలు నిజం తెలిస్తే..?

అందుకేనా కృష్ణ మహేష్ ను కాదని నరేష్ తో ఉండేవారు.. అసలు నిజం తెలిస్తే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కృష్ణ అనారోగ్యం బారిన పడి నవంబర్ 15వ తేదీన పరమపదించారు. కృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనమైన సినిమాలు తీసి ఆంద్రా జేమ్స్ బాండ్ గా పేరు తెచ్చుకున్నారు.. సినిమాల్లో కొత్త స్టైల్ చూపించడంలో అప్పట్లో కృష్ణ ని మించిన హీరో లేరని చెప్పవచ్చు. దాదాపుగా 350 పైగా చిత్రాల్లో నటించి కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో సూపర్ స్టార్ గా నిలిచారు. అలాంటి కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆయన గురించి అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం కృష్ణకు సంబంధించిన మరో విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది..

Advertisement

also read;కృష్ణ-విజయనిర్మల పెళ్లి.. ఇందిరాదేవి నిర్మలను ఎలా చూసేవారో అసలు నిజాలు చెప్పిన మేకప్ మాన్ మాధవరావు..!!

Advertisement

కృష్ణ విజయనిర్మల మరణాంతరం ఎలాంటి సంబంధం లేనటువంటి నరేష్ కుటుంబంతో ఎక్కువగా ఉండేవారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పాల్గొన్న కృష్ణ ఒక విషయం చెప్పారు.. అదేంటయ్యా అంటే.. నరేష్ అంటే నాకు చాలా ఇష్టం.దీనికి ప్రధాన కారణం నాకు ఎలాంటి అవసరం వచ్చినా క్షణాల్లో చేసి పెట్టేది నరేష్ మాత్రమే అని అన్నారు. అంతేకాకుండా అతడు షూటింగ్లో ఉన్నా నాకోసం ఆలోచిస్తాడని, ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడని తెలిపారు. ముఖ్యంగా మహేష్ బాబు సూపర్ స్టార్ అయిపోయారు ఎంతో బిజీగా ఉంటారు..

ఆయనకు సంబంధించిన పనులను అతడి భార్య నమ్రత చూసుకుంటూ ఉండేది. మరీ ముఖ్యంగా విజయనిర్మల కాలం చేసిన తర్వాత కృష్ణ అవసరాలను దగ్గరుండి తీర్చిన వ్యక్తి నరేష్.. ఇక నరేష్ విషయానికి వస్తే.. అతని పేరులో కూడా నరేష్ విజయ్ కృష్ణ అంటూ తన తల్లి పేరుతో కలిపి స్టెప్ ఫాదర్ అయినటువంటి కృష్ణ పేరుని జత చేసుకున్నారు. ఈ విధంగా కృష్ణకు అత్యంత దగ్గరైన వ్యక్తి నరేష్. అందుకే నరేష్ కూడా కృష్ణకు ఎంతో ప్రేమ, గౌరవం అందిస్తూ వచ్చారు. విజయనిర్మల చనిపోయిన తర్వాత కూడా ఆమె లేని లోటు తెలియకూడదని నరేష్ ఎంతో ఆరాట పడ్డారట. ఈ క్రమంలోనే నరేష్ కృష్ణకు ఎంతగానో దగ్గరయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

also read;కృష్ణ ఆహార అలవాట్లు.. చనిపోయే ముందు ఏం తిన్నారంటే..?

Visitors Are Also Reading