Home » ప్ర‌భాస్ విష‌యంలో ఆ నిర్మాత వెనుక‌డుగు వేయ‌డానికి కారణం అదేనా..?

ప్ర‌భాస్ విష‌యంలో ఆ నిర్మాత వెనుక‌డుగు వేయ‌డానికి కారణం అదేనా..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్ర‌భాస్‌. ఇక అప్పటి నుంచి ప్ర‌భాస్ కి విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. ప్ర‌భాస్ డేట్లు దొరికితే చాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నారు. ప్ర‌భాస్‌తో సినిమా అంటే ఓ నిర్మాత వ‌ద్ద‌నుకుంటున్నాడ‌ట‌. కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ప్ర‌స్తుతం ఆ డ‌బ్బు ఇస్తే చాలు, సినిమా అవ‌సరం లేద‌ని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.


రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి కాంబోలో రాజా డీల‌క్స్ అనే సినిమా రానున్న‌ట్టు వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి ఎక్క‌డా కూడా క‌న్‌ఫ‌ర్మ్ చెప్ప‌లేదు. కానీ క‌థ‌, హీరోయిన్లు, చిత్రం సెట్ వంటి త‌దిత‌ర వార్త‌లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకు నిర్మాత మారే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక చిత్రాన్ని నిర్మిద్దామ‌నుకున్న నిర్మాత డీవీవీ దాన‌య్య రెమ్యున‌రేష‌న్ కింద ప్ర‌భాస్ కి రూ.50 కోట్లు ఇచ్చార‌ని అప్ప‌ట్లో టాక్ వినిపించింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే మారుతి బృందం ప‌ని చేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

Advertisement


ప్ర‌భాస్ తో మూవీ ఎప్ప‌టికీ సెట్స్ పైకి వెళ్ల‌క‌పోయే స‌రికి.. మ‌రి ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌న్న క్లారిటీ లేక‌పోవ‌డంతో డీవీవీ దాన‌య్య వెన‌క్కి త‌గ్గుతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల నుంచి స‌మాచారం. ఎవ‌రైనా నిర్మాత ముందుకు వ‌స్తే ఆ రెమ్యున‌రేష‌న్ డ‌బ్బు తీసుకుని ప్ర‌భాస్ డేట్స్ ని ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యార‌ని వార్త వివ‌నిపిస్తోంది. ఇందులో వాస్త‌వం ఎంత అనేది క్లారిటీ లేదు. ఈ విష‌యంలో ఒక‌టి రెండు రోజుల్లోనే ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని స‌మాచారం.

Also Read : 

విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఆ ఉద్యోగం కూడా చేశాడా..?

ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే ఏం జ‌రుగుతుందో చెప్పిన వేణుస్వామి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

Visitors Are Also Reading