Home » ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే ఏం జ‌రుగుతుందో చెప్పిన వేణుస్వామి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే ఏం జ‌రుగుతుందో చెప్పిన వేణుస్వామి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

by Anji
Published: Last Updated on

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ గురించి ప్ర‌స్తుతం ఓ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే త‌న కెరీయ‌ర్ ముగిసిపోతుంద‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో ఏది జోక్ అనుకుని కొట్టి పారేయాల్సిన విష‌యం కాద‌ని కొంద‌రూ హెచ్చ‌రిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్ర‌ముఖ జ్యోతిష్కుడు అయిన వేణుస్వామి ప్ర‌భాస్ జాత‌కం చూసి చేసిన వ్యాఖ్య‌లు అని ప‌లువురు పేర్కొంటున్నారు. ఇదివ‌ర‌కు స‌మంత‌, నాగ‌చైత‌న్య ప్రేమ పెళ్లి చేసుకున్న స‌మ‌యంలో వీరు నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకుంటార‌ని వేణుస్వామి జోస్యం చెప్పారు. స‌రిగ్గా అదే జ‌ర‌గ‌డం విశేషం.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూతురు మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుంద‌ని కూడా జోస్యం చెప్పారు. అది కూడా వాస్త‌వంగానే జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు చిరంజీవి కూతురు రెండు పెళ్లిళ్లు చేసుకుంది. ఇక మూడ‌వ పెళ్లి కూడా చేసుకోబోతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. సినిమా కెరీర్ విష‌యానికొస్తే అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు ప్ర‌భాస్‌. బాహుబ‌లి బిగినింగ్‌, బాహుబ‌లి క‌న్‌క్లూష‌న్ సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ బాలీవుడ్‌లో ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే వంటి క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నాడు. దేశంలోనే అంద‌రికంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న వారిలో ప్ర‌భాస్ తొలి స్థానంలో ఉన్నాడు.

ప్ర‌స్తుతం డార్లింగ్ ఒక సినిమాకు రూ.100 కోట్ల‌కు పైగా తీసుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌భాస్ పెళ్లి విష‌యంలో అభిమానులు కొంత నిరాశ‌తో ఉన్నార‌ట‌. సినీ కెరీర్ బాగానే ఉన్నా అంద‌రూ హీరోల వ‌లే ప్ర‌భాస్ కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక ప్ర‌భాస్ పెళ్లి జ‌రిగితే ప్ర‌భాస్ అభిమానుల ఆనందానికి అంతే ఉండ‌దు. కానీ ప్ర‌భాస్ పెళ్లి చేసుకుండా ఉంటేనే ఆనందంగా ఉంటాడ‌ని.. పెళ్లి జ‌రిగితే ఉద‌య్ కిర‌ణ్ మాదిరిగా ప్రాణ‌గండం ఉంద‌ని జ్యోతిష్కుడు వేణుస్వామి పేర్కొంటున్నాడు. అందులో వాస్త‌వం ఎంత ఉందో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్ అవుతోంది. గ‌తంలో ఆయ‌న చెప్పిన జోస్యాలు ఫ‌లించ‌డంలో ఆయ‌న చెప్పే దానికి ఎక్కువ‌గా బ‌లం ఉంటుంద‌ని కొంద‌రూ న‌మ్ముతుంటారు. ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడో లేక అలాగే ఉంటాడో వేచి చూడాలి.

Also Read :  ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేష‌న్ పై అనురాగ్ క‌శ్య‌ప్ ఏమ‌న్నారో తెలుసా..? సీతారామం సినిమాకు ఇప్ప‌టివ‌ర‌కు ఎంత లాభం వ‌చ్చిందో తెలుసా..?

Visitors Are Also Reading