Home » విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఆ ఉద్యోగం కూడా చేశాడా..?

విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఆ ఉద్యోగం కూడా చేశాడా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో కష్టపడితే ఏదైనా సాధించవచ్చనే అర్థానికి కరెక్ట్ గా సూట్ అవుతారు విజయ్ దేవరకొండ.. ఆయన ఇండస్ట్రీలో రాణించడం కోసం ఎంతో కష్టపడ్డారు. ముందుగా హీరో పక్కన పాత్రలు, ఫ్రెండుగా ఇలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ కాస్త గుర్తింపు సంపాదించారు.. ఈ విధంగా రావడం కోసం ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా ఎంతో కష్టపడి ఇండస్ట్రీ లో హీరోగా తెరంగెట్రం చేసి,సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో లైగర్ సినిమాతో ముందుకు రాబోతున్నారు విజయ్..

Advertisement

సినిమా విడుదల కాకముందే విజయ్ పై అంచనాలు అనేకం పెట్టుకున్నారు.. ఇక నార్త్ లో ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెరుగుతోందని కూడా చెప్పవచ్చు.. లైగర్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.. ఈ విధంగా విజయ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.. కానీ ఆయన ఈ స్థాయికి రావడానికి ముందు ఇండస్ట్రీలో ఉద్యోగం చేశారు.. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, దర్శకుడు తేజ వద్ద అసిస్టెంట్ గా ఉద్యోగం చేశాడు..

Advertisement

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.. ఈ తరుణంలో పూరి జగన్నాథ్ జీతం ఎక్కువ ఇస్తారని ఆయన దగ్గరికి వెళ్ళమని మా నాన్నగారు చెబితే.. ఆయన ఆఫీస్ కి వెళ్ళానని, కానీ ఆయన్ని కలవడం కుదరలేదని విజయ్ తెలియజేసాడు.. డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత ఆయనను కలవడం జరిగిందని, ప్రస్తుతం ఆయనతో లైగర్ సినిమా చేశానని తెలియజేశాడు.. ఈ సినిమాని ముందుగా తెలుగు సినిమాగానే చేద్దామనుకున్నా మని, కథ మొత్తం విన్నాక పాన్ ఇండియా లెవల్లో చేద్దామని నిర్ణయానికి వచ్చామని తెలియజేశాడు. ఎట్టకేలకు ఈనెలలో సినిమా థియేటర్ లోకి రాబోతోంది..

also read:

Visitors Are Also Reading