Home » బ్రిట‌న్ రాజ‌వంశం రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

బ్రిట‌న్ రాజ‌వంశం రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

by Anji
Ad

బ్రిట‌న్ రాజ‌వంశానికి బ్రిటీష‌ర్ల‌లో ఎంతో అత్యున్న‌త స్థాయి గౌర‌వం ఉంది. ప్ర‌స్తుతం బ్రిట‌న్ ని అధికారికంగా ఏలుతున్న వేల్స్ రాజ కుటుంబం 300 ఏళ్ల పై నుంచి ఇక్క‌డి రాజ‌రికాన్ని చెలాయిస్తోంది. 1701లో కింగ్ డ‌మ్ ఆఫ్ ఇంగ్లండ్ కింగ్ డ‌మ్ ఆఫ్ స్కాట్లాండ్ కింగ్ డ‌మ్ ఆఫ్ ఐర్లాండ్ క‌ల‌యిక‌తో నాటి యునైటేడ్ కింగ్ డ‌మ్ ఏర్ప‌డింది. అప్ప‌టి సంప్ర‌దాయాల ప్ర‌కారం మోనార్క్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు క్వీన్ యాన్‌. ఇక ఆ త‌రువాత బ్రిటీష్ కింగ్ డ‌మ్ ఎంతో విస్త‌రించింది. కాల‌నీలు ఏర్పాటు చేసుకొని ఆ కాల‌నీల‌కు కూడా క్వీన్ లేదా కింగ్ మోనార్క్ అయ్యారు. ఇండియాలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పాల‌న అంతం అయిన త‌రువాత బ్రిటీషు రాజుల పాలిట పాల‌నే కొన‌సాగింది.


ఇప్ప‌టికీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటివి ఒక‌ప్ప‌టి బ్రిటీషు కాల‌నీలు. బ్రిట‌న్ నాగ‌రిక‌త విస్త‌రించిన దేశాల‌లో బ్రిటీషు క్వీన్ లేదా కింగ్ ని త‌మ మోనార్క్ గా భావించే సంప్ర‌దాయం ఉంది. 300 ఏళ్ల‌లో 13వ రాజు చార్లెస్ త్రీ.క్వీన్ ఎలిజ‌బెత్ 2 పెద్ద‌కొడుకు ఇత‌డు. ఇప్ప‌టికీ రాజుల ఇంటి పెళ్లిళ్లు.. శుభ‌కార్యాలు అంటే బ్రిట‌న్‌కి పండుగ‌. ఇక మూడ‌వ చార్లెస్ పెద్ద కొడుకు ప్రిన్స్ విలియ‌మ్ కేట్ పెళ్లి అత్యంత‌ ఘనంగా జ‌రిగింది. బ్రిట‌న్‌కే పెద్ద పండుగ వాతావ‌ర‌ణం లా వీరి పెళ్లి జ‌రిగిది. కొన్నేళ్ల కింద వారు జంట‌గా ఎక్క‌డ క‌నిపించినా అది ఒక క్రేజీ సీన్ అనే చెప్పాలి. ఆ సామ్రాజ్యానికి రాజ‌రిక వార‌సులం అని చెప్పి ఈ కుటుంబీకులు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో జోక్యం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌రు. కేవ‌లం ప్ర‌జ‌ల‌కు స‌న్నిహితులుగానే ఉంటారు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖ‌రీదైన బ‌హుమ‌తి ఏంటో తెలుసా..?

బ్రిటీషు రాచ‌రిక కుటుంబం పెట్టుకున్న అతిపెద్ద క‌ఠిన నియ‌మ‌మేటంటే రాయ‌ల్ ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కూడ‌ద‌న్న‌ది వారి నియ‌మం. బ్రిట‌న్ రాజ‌కుటుంబానికి వ్యాపారాలే ఆర్థిక వ‌న‌రులు. ప్ర‌థ‌మ సంతానం రాజులు లేదా రాణులు అవుతారు. బ‌తికి ఉన్నన్నీ రోజులు వారే ఆ హోదాలో ఉంటారు. మిగ‌తా వారు ఆశ ఉన్నా కూడా రాజ‌కీయాల్లోకి రారు. ప్ర‌ధాని ఎన్నిక‌ల్లోనూ రాణి కుటుంబ స‌భ్యులు ఎవ్వ‌రికీ అనుకూలంగా, వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న చేయ‌రు. ఇలా వారు పెట్టుకున్న గొప్ప సంప్ర‌దాయాలే వారిని ప్ర‌జ‌ల్లో గౌర‌వాన్ని నిలుపుతున్నాయి. బ్రిటీషు రాజ‌కుటుంబం ప‌న్ను చెల్లింపుదారుల సొమ్ముతో విలాసాలు చేయ‌రు. వారికి ప్ర‌త్యేకంగా వ్యాపారాలు, భూములు ఉంటాయి. వాటి నుంచి ఆదాయ‌మే రాజ‌కుటుంబానికి కావాల్సినంత స్థాయిలో ఉంటుంది. రాజ‌కుటుంబం ఇన్నాళ్ల పాటు గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో ఉన్న‌ద‌ని అన‌డాన‌కి కార‌ణం ఇదే అని చెప్ప‌వ‌చ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కోపాన్ని త‌గ్గించుకోవాలి

Visitors Are Also Reading