Home » డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగడానికి అసలు కారణం అదేనా ?

డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగడానికి అసలు కారణం అదేనా ?

by Anji
Ad

సాధారణంగా ఒకప్పుడు కేవలం టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఉండేవి. క్రికెట్ అభిమానులు కూడా వీటిని బాగానే ఆదరించేవారు. కానీ ఎప్పుడైతే వన్డే మ్యాచ్ లు వచ్చాయో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ కి ఆదరణ తగ్గింది. ఇక ఇప్పుడు టీ20 లు వచ్చే సరికి వీటిని పట్టించుకునే వారే కరువయ్యారు. సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ని కాపాడుకునేందుకు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా పెట్టారు. ప్రతీ రెండేళ్లకోకసారి అన్ని దేవాలు వారు సాధించిన విజయాల శాతాలను పరిగణలోకి తీసుకొని టాప్ 2 ఉన్న జట్ల మద్య ఈ ఫైనల్ నిర్వహిస్తారు. ఈసారి ఆస్ట్రేలియా, భారత్ జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నాయి.  ఇదిలా ఉంటే ఈ ఫైనల్ ఎప్పుడూ ఇంగ్లాండ్ లోనే ఎందుకు జరుగుతుందని కొందరికీ అనుమానం మొదలైంది. 

Advertisement

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ వేదికగా ఓవల్ లో జూన్ 07 న డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. గత ఏడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే నిర్వహించిన విషయం తెలిసిందే. 2025లో జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ లోనే నిర్వహించనున్నారు. ప్రతీసారి ఫైనల్ వేదిక ఇంగ్లాండ్ కావడం ఆసియా అభిమానులకు నచ్చడం లేదు. ఇంగ్లాండ్ లోని కండీషన్స్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడి పిచ్ లు సాధారణంగా స్వింగ్ కి అనుకూలిస్తాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కి వచ్చిన ఈ జట్లు ఆసియా టీమ్ మీద అలవొక గెలిచే అవకాశం ఉంటుంది.

Advertisement

ప్రతిసారి  డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఐసీసీలో ఎక్కువగా ఇంగ్లాండ్ కి చెందిన వారు ఉండటమే అని తెలుస్తోంది.  వీరు ఎక్కడ వేదికను డిసైడ్ చేస్తే అక్కడ ఆడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. బీసీసీఐ విషయంలో జోక్యం కల్పించుకోవడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ టెస్ట్ మ్యాచ్ లను పెద్దగా విలువనివ్వదు. ఎప్పుడూ కాసులు ఎలా సంపాదించుకోవాలనే దానిపై  దృష్టి ఉంటుంది. ఐసీసీకి తిరుగులేకుండా పోయింది. వారికి నచ్చిన వేదికను నిర్ణయిస్తుంది. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ సారి ఆస్ట్రేలియా పై గెలుస్తుందో లేదో చూడాలి. ఒకవేళ భారత్ ఈ ఫైనల్ లో ఓడిపోతే బీసీసీఐ డబ్ల్యూటీసీ వేదిక గురించి ఏమైనా కొత్త ఆలోచన చేస్తుందేమో చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

నెగిటివ్ ఆలోచనలు వస్తే ఏం చేయాలో తెలుసా…?

 ధోనీ బౌలింగ్.. కోహ్లీ కీపింగ్ చేశారనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading