Home » ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సాధించడానికి అసలు కారణం అదేనా ?

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సాధించడానికి అసలు కారణం అదేనా ?

by Anji

వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచుల్లో ఓడిపోయి చాలా దారుణమైన స్థితిలో లీగ్ దశని ప్రారంభించింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా మెంబర్స్ ఏమాత్రం భయపడకుండా తమ స్ట్రాటజీని నమ్ముకొని ముందుకు దూసుకొచ్చింది. ఇక ఎప్పుడైతే రెండు మ్యాచ్ లో ఓడిపోయిందో అప్పటినుంచి వరుస విజయాలను అందుకుంటూ వరుసగా లీగ్ మ్యాచ్ లో గెలిచి అలాగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ మ్యాచ్ లో  కూడా తనదైన రీతిలో సత్తాను చాటి.. ఆరోసారి వరల్డ్ కప్ అందుకుంది.

ఆస్ట్రేలియా టీమ్ మెంబర్స్ అయిన అందరూ ప్లేయర్లు కూడా తమదైన రీతిలో సత్తా చాటారంటే.. ఆస్ట్రేలియా టీమ్ గొప్పతనం ఎంటో మనం అర్థం చేసుకోవచ్చు.  అయితే ఆస్ట్రేలియా కప్ కొట్టడం వెనక అసలైన రహస్యం ఏంటి అనేది ఆ టీం కోచ్ అయిన ఆండ్రూ మెక్ డోనాల్డ్ వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా టీమ్ వరుసగా ఇండియా, సౌతాఫ్రికాతో ఆడిన రెండు మ్యాచ్లో ఓడిపోవడంతో ఇక తర్వాత ఆడిన వరుస మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని అనుకున్నాం. ఇక అందులో భాగంగానే మేము చేసిన వ్యూహాలు అన్ని కూడా మార్చకుండా అవే వ్యూహాలను అమలు చేశాం.  ఏమాత్రం తగ్గకుండా అవే వ్యూహాలతో గెలిచి మా సత్తా నిరూపించుకున్నాం అని చాలా గొప్పగా ఆస్ట్రేలియా టీమ్ కోచ్ చెప్పడం, నిజంగా గ్రేటే అని చెప్పాలి.

వాస్తవానికి ఎప్పుడైతే ఆస్ట్రేలియా టీమ్ డౌన్ అయినట్టు కనిపించిందో అప్పుడు కూడా నేను అవే స్ట్రాటజీని నమ్ముకుంటూ ముందుకు వెళ్లాం. అంతేతప్ప నేను ఎప్పుడూ ప్లేయర్ల మీద ప్రెజర్ తీసుకురాలేదు. అందుకే మేము ఇలాంటి గెలుపును సొంతం చేసుకుని మరీ వరుసగా సక్సెస్ లు సాధించాం. అందుకే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నా టీమ్ ని నమ్మాను కాబట్టి దానిని గెలిపించి చూపించాం. అందుకే మనం నమ్మిన స్ట్రాటజీని నమ్ముకొని ముందుకు వెళ్లడమే మేము చేసిన రిస్క్. అది చేయడం వల్లే మేము గెలిచి చూపించాం అంటూ చాలా గర్వంగా ఆయన చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ కప్ గెలవడం చూస్తే మనం నమ్మిన స్ట్రాటజీని పర్ఫెక్ట్ గా నమ్ముకుంటూ ముందుకు వెళ్లడమే ఎవరి విజయానికైనా కారణం అంటూ ఆస్ట్రేలియా టీమ్ ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి!

Visitors Are Also Reading