Home » శ్రీముఖి అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకోవడానికి కారణం రష్మీనా..?

శ్రీముఖి అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకోవడానికి కారణం రష్మీనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ యంగ్ యాంకర్  ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీముఖి మాత్రమే. పటాస్ షో ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు  ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమె యాంకర్ గా రాకముందే సినిమాల్లో నటించింది.కానీ అంతగా గుర్తింపు రాలేదు.  ఈ మధ్యకాలంలోనే బిగ్ బాస్ కి కూడా వెళ్లి మరింత ఫేమస్ అయిపోయింది.
అలాంటి శ్రీముఖిని  అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుందట.  అయితే శ్రీముఖి రష్మీ కారణంగానే సినిమాల్లోకి రాకూడదని సంచన నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసి కొంత మంది నెటిజన్స్ రష్మీ కోసం  సినిమాల్లో ఎందుకు నటించకూడదని భావిస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం రష్మీ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా  చేసి ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో కథలు సరిగ్గా ఎంచుకోకుండా ఓకే చేసి హీరోయిన్గా చేసింది. కానీ ఆమె నటించిన సినిమాల్లో గుంటూరు టాకీస్ మాత్రమే  హిట్ అయింది. మిగతావన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఏ ఒక్క దర్శక నిర్మాత కూడా ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆమె యాంకర్ గానే పరిమితం కావలసి వచ్చింది. అయితే రష్మీ సినీ కెరీర్ ని  క్షుణ్ణంగా గమనించిన శ్రీముఖి మంచి కథలు వస్తే తప్ప సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుందట.

Advertisement

Visitors Are Also Reading