Home » హనీరోజ్ అందమే కాదు.. దానికి మించిన ఆస్తులు..ఎన్ని కోట్లంటే.?

హనీరోజ్ అందమే కాదు.. దానికి మించిన ఆస్తులు..ఎన్ని కోట్లంటే.?

by Sravanthi Pandrala Pandrala
Ad
 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హాని రోజ్ పేరు మారి మోగిపోతుంది. ఈ అందాల బ్యూటీ  అందానికి కుర్ర కారు కూడా మైమరిచిపోతున్నారు. వీర సింహారెడ్డి సినిమా  విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్న  ఆమె ప్రభావం తగ్గడం లేదు. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను  ఫిదా చేయడంలో సక్సెస్ అయింది. ఇక తెలుగులో ఆమె మొదటి సినిమా వీరసింహారెడ్డి  అని అందరూ అంటారు.
కానీ 2008లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో శివాజీ హీరోగా నటించిన ఆలయం సినిమా ద్వారా మొదటిసారి హీరోయిన్ గా వచ్చింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన వర్షం సాక్షిగా చిత్రంలో కూడా ఆమె చేసింది.  ప్రస్తుతం తెలుగులో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి బాలకృష్ణ వీరసింహారెడ్డి తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు చరిత్ర క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. 33 సంవత్సరాలు ఉన్న హాని రోజ్ తన కెరియర్ షెడ్యూల్ కాలేదని ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకి 20 లక్షలు పైగానే తీసుకుంటుందట.
అలాంటి ఆమెకు ఇప్పటివరకు రెండు కోట్లకు మేరా నికర ఆస్తులు,  ఖరీదైన కార్లు బంగ్లాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.  ఇక ఆమె తల్లిదండ్రుల నుంచి వచ్చిన విల్లాతో పాటు తన సొంతంగా కష్టపడి అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసిందట.  ఇవన్నీ కలిసి ఆమెకు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఆమె సొంత ఫ్లాట్లోనే ఉంటూ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది..

Advertisement

Visitors Are Also Reading