Home » శీతాకాలంలో చన్నీటి స్నానం మంచిదా..? వేడి నీటి స్నానం మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..?

శీతాకాలంలో చన్నీటి స్నానం మంచిదా..? వేడి నీటి స్నానం మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

సాధారణంగా  అన్ని కాలాలు వేరు. శీతాకాలం వేరు. ఎండాకాలం, వర్షాకాలంలో ఎలా ఉన్నా కానీ.. శీతాకాలంలో మాత్రం చర్మం పరంగా, ఆరోగ్యం పరంగా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  సాధారణంగా కొంతమంది చన్నీటితో స్నానం చేస్తారు. మరి కొంతమంది వేడి నీటితో స్నానం చేస్తారు. స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. చిరాకు పోయి మనసుకి హాయిగా ఉంటుంది. అయితే చన్నీటి స్నానం మంచిదా? వేడినీటి స్నానం చేయడం మంచిదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి ఏ స్నానం వల్ల లాభాలు ఉన్నాయి? లేక నష్టాలు ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.


శీతాకాలంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల బాడీలో వాతవ అనేది పెరుగుతుంది. దీనివల్ల నొప్పులు, కండరాల నొప్పులు, చర్మం పొడి బారడం, బలహీనమైన జీవక్రియ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా శరీరంలో నొప్పులు తీరవు. కానీ ఒకవేళ క్రమం తప్పకుండా చన్నీటితో స్నానం చేసే వారైతే మాత్రం శీతాకాలంలో కూడా చెన్నైకి స్నానం చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎలాంటి భంగం కలిగించదు. అంతేకాకుండా చన్నీటి స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. తెల్ల రక్తకణాలు అధిక శాతం, జీవక్రియ రేటు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Advertisement

Advertisement

 


వింటర్ సీజన్ లో వేడి నీటితో స్నానం శరీర వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు, శరీరానికి ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు.. వేడి నీళ్ళు చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం ద్వారా జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చలి తీవ్రతను కూడా తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. చన్నీటి స్నానం చేయడం వల్ల వాతాన్ని పెంచడమే కాకుండా చలి కూడా పెరుగుతుంది. కాబట్టి శరీరం వేడినీ కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. చలికాలంలో బాహ్య ప్రపంచం చల్లగా ఉంటుంది. శరీరం అంతర్గత వాతావరణాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు శీతాకాలంలో వేడినీటితో స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వేడినీటి స్నానంతో చలి కారణంగా వణుకు తగ్గడమే కాకుండా ఒత్తిడి, కండరాల నొప్పులు, సీజనల్ గా వచ్చే వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబతున్నారు.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading