Home » హీరోగా నిహారిక భ‌ర్త ఎంట్రీ…? మెగాఫ్యామిలీ స‌పోర్ట్ ఉంటుందా…?

హీరోగా నిహారిక భ‌ర్త ఎంట్రీ…? మెగాఫ్యామిలీ స‌పోర్ట్ ఉంటుందా…?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని ఫ్యామిలీల నుండే ఎక్కువ మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. హీరోల‌ కొడుకులు, అల్లుల్లు, మ‌న‌వ‌ళ్లు ఇలా ఎంట్రీ ఇస్తునే ఉన్నారు. అంతేకాకుండా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల‌కు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి కూడా చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

అయితే టాలెంట్ ఉంటే ఏవిధంగా సినిమాల్లోకి వ‌చ్చినా అభిమానులు ఆద‌రిస్తున్నారు. దాంతో ఇప్ప‌టికే మెగాఫ్యామిలీ నుండి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ అల్లు అర్జున్, సాయిధ‌రమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా స‌క్సెస్ అయ్యారు. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంటున్నారు.

Advertisement

కాగా ఇప్పుడు మెగాఫ్యామిలీ నుండి మ‌రో హీరో ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక భ‌ర్త చైత‌న్య జొన్న‌గ‌డ్డ‌ల కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడా ఏంటి అన్న అనుమానాలు మొద‌ల‌వుతున్నాయి. దానికి కార‌ణం చైత‌న్య హీరోల రేంజ్ లో ఫోటో షూట్ లు నిర్వ‌హిస్తూ వాటిని సోష‌ల్ ఈ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

అంతే కాకుండా ఇది వ‌ర‌కూ సైలెంట్ గా క‌నిపించే చైత‌న్య ఇప్పుడు సోష‌ల్ మీడియాలో డిఫ‌రెంట్ వీడియోలు కూడా చేయ‌డంతో నెటిజ‌న్ లు మ‌రో హీరో ఎంట్రీ ప‌క్కా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే నిహారిక చైత‌న్య మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయని ఇద్ద‌రూ అన్ ఫాలో చేసుకున్నార‌ని వార్త‌లు గుప్పుమంటున్న సంగ‌తి తెలిసిందే. నిహారిక పెళ్లి ఫోటోల‌తో పాటూ భ‌ర్త ఫోటోలు అన్నీ డిలీట్ చేసింది. దాంతో ఒక‌వేళ చైత‌న్య హీరోగా ఎంట్రీ ఇస్తే మ‌రి మెగాఫ్యామిలీ మ‌ద్ద‌తు ఉంటుందా అన్న అనుమానాలు కూడా నెటిజ‌న్ ల‌కు వ‌స్తున్నాయి.

ALSO READ : విరూపాక్ష సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

Visitors Are Also Reading