టాలీవుడ్ లో డైనమిక్ హీరోయిజానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆ పేరు సంపాదించుకోవడం వెనుక ఆయన కృషి పట్టుదల చాలానే ఉంది. తెలుగు తెరపై అప్పటికే చిత్ర రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలందరూ దూసుకెళ్తున్న తరుణంలో చిరంజీవి సినీ ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా నృత్యాల్లో మెరుపు వేగాన్ని, అద్భుతమైన ఫైటింగ్ చేస్తూ ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకోగలిగారు. చిరంజీవి పోషించిన ప్రతి పాత్రలో కూడా ప్రేక్షకులు హీరోయిజాన్ని చూశారు.
Advertisement
ఈ తరుణంలో 67 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక విశిష్ట అధ్యయాన్ని లిఖించుకుంటున్నారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఇలా సమాధానం చెప్పాడు. మీరు చిత్ర రంగంలోకి వచ్చిన కొత్తలో పోటీ ఎలా ఉండేది..? అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది..? అని అడగ్గా.. ముఖ్యంగా ఏరంగంలోనైనా పోటీ ఉండాలి. పోటీ లేకపోతే ఎదుగుదల అనేది ఉండదు. నా వరకు పోటీ అనే పదం ఎదుగుదలకు ఎప్పటికప్పుడు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలకు వచ్చిన గుర్తింపు క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా.. ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను ఇప్పటికీ కూడా మరిచిపోలేకపోతున్నాం. ఉదాహరణకు ఎస్వీ రంగారావు, నాగభూషణం, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, సూర్యకాంతం ఇలా చాలా మంది ఉన్నారని చెప్పారు. కానీ హీరోలకు అభిమానులు ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎక్కువగా ఉండరు అందుకే మీరు అలా అడిగారేమో అని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
మీ కెరీర్ ప్రారంభంలో బ్రాండ్ అనేది ఎక్కువగా ఉండేది.. అయినా మీరు దానిని లెక్క చేయకుండా నెగెటివ్ పాత్రలు చేసి కూడా ఆ ముద్రకు దూరంగా ఎలా ఉండగలిగారు..? అని ప్రశ్నించగా.. బ్రాండ్ పడకూడదని నేను ప్లాన్స్ చేసుకుని .. కావాలని నెగెటివ్ పాత్రలు చేయలేదు. పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలతో కొన్ని, ఇష్టం ఉండి కొన్ని, మొహమాటంతో కొన్ని చేశాను. అందులో కొన్ని నాకు చాలా విధాలుగా హెల్ప్ అయ్యాయని తెలిపాడు. కొన్ని పాత్రల వల్ల అవార్డులు వచ్చాయి. ఉదాహరణకు పున్నమినాగు. కొన్ని పాత్రల వల్ల పెద్ద దర్శకుల దగ్గర మెలుకువలు తెలుసుకోగలిగాను. ఉదాహరణకు ఇది కథ కాదు, 47 రోజులు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటివి. కొన్ని పాత్రల వల్ల పెద్ద దర్శకులతో పరిచయం దక్కింది. మోసగాడు ఒకటని చెప్పాలి. కొన్ని పాత్రల వల్ల గుణపాఠం నేర్చుకున్నానని వివరించాడు.
Advertisement
అలనాటి సంగీత, సాహిత్యంపై మీ అబిప్రాయం ఏమిటని జర్నలిస్ట్ చిరంజీవిని ప్రశ్నించగా.. అందుకు చిరంజీవి ఇలా సమాధానం చెప్పాడు. అప్పటి సాహిత్యం, సంగీతం ఈ నాటికి మనం మరిచి పోకుండా వింటున్నాం. పాడుకుంటున్నాం. ఈ నాటి పాటలు థియేటర్ లో సినిమా తీసి వేయగానే మన మనసులోంచి మనకు చెప్పకుండానే వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా నెంబర్ వన్ స్థానం సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ దీనిని మీరెలా సాధించరనగా.. ప్రేక్షకుల గుండె లోతుల్లో మంచి నటుడు అనే సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలన్నా ప్రయత్నం చేస్తున్నానే తప్ప ఈ నెంబర్ల కోసం ప్రత్యేకించి నేను ఎప్పుడు ప్రయత్నించలేదని తన సక్సెస్ గురించి సమాధానం చెప్పారు చిరంజీవి.
నట వారసత్వం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా..? మంచి అభిప్రాయమై అయినప్పటికీ ప్రతిభ, కృషి లేకుండా నటవారసుడు అని ప్రేక్షకులు ఆదరించరు. తెలుగు సీనియర్ హీరోల్లో మీకు స్పూర్తి ఎవరు..? నటన పరంగా నాకు స్పూర్తి అంటూ ఎవ్వరూ లేరు. కానీ మరోరకంగా నా సీనియర్ హీరోలందరూ నాకు స్ఫూర్తి అనే చెప్పాలి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే విషయంలో. మీ చిత్రాల నిర్మాణంలో సాంకేతిక విలువలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాంకేతిక విలువలు కథను డామినేట్ చేసేవి. వాటిని కథకు ఆసరా చేసే విధంగా ఉండడం..హాలీవుడ్‌కి తెలుగుకి వ్యత్యాసం అంటారా..? సాంకేతిక విలువలు మనకు అందుబాటులో ఉన్నా వాటిని పూర్తిగా అందుకొని వాడుకునే స్థాయిలో మనవాళ్లు లేరు. బడ్జెట్ రూపేనా కానీ , అవగాహన లేక కానీ అవసరం లేదులే అనుకొని ఉండాలి. అవార్డులు నటుడి నటనకు ఎలా ఉపయోగపడుతాయని భావిస్తున్నారు. రిటైర్డ్ అయ్యాక తీపి గుర్తులు తప్ప.. నటుడి అభివృద్ధికి అవి ఏ రకంగా ఉపయోగపడవు.
నటనలో అనుకరణ పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా.. తెలిసో తెలియకో అది ప్రతి వాళ్లలో ఉంటుంది. అనుకరణ అనేది నటుడికి అదనపు క్వాలిఫికేషన్ పాత్ర ఔచిత్రాన్ని, ఊహించి అర్థం చేసుకుని దానిని తెరపై అనుకరిస్తే అది ఆరోగ్యకరమైన అనుకరణ. కానీ సహనటులను అనుకరిస్తే అది అనారోగ్యమే అని చెప్పాలి. నటుడికి, కథ, కథనాలకు గల సంబంధం ఎటువంటిది..? చక్కని కథ, కథనం ఒక నటుడికి ప్రాణం పోస్తాయి. ఆకథ, కథనానికే ప్రాణం పోస్తాడు. యువ నటులకు మీరు ఇచ్చే సలహా ఏమిటని ప్రశ్నించగా..? సలహా తీసుకునే స్థానంలో ఉన్నాను. నేను సలహా ఇచ్చే స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాననని అప్పటి ఆంధ్రప్రభ విలేకరీ విశ్వనాథ్ కి రాతపూర్వకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు చిరంజీవి.
Also Read :
రాజమౌళి తీసే ప్రతి సినిమాలో ఆ సెంటిమెంట్ తప్పకుండా ఉండాల్సిందే..!
ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రుల పైన కేసులు పెట్టిన హీరోయిన్స్ ఎవరంటే..?