టికెట్ల రేట్ల వ్యవహారంపై నాగార్జున వైఖరి విస్మయ పరిచే విషయమే. టికెట్ల రేట్లతో నాకు ఇబ్బంది లేదు అని నాగార్జున నిరాకరించడం చిత్ర పరిశ్రమలో ఒక వర్గానికి మింగుడు పడడం లేదట. చిత్ర సీమ అంతా టికెట్ రేట్లు పెంచాలని మొత్తుకుంటుంటే నాకు ఎంత ఉన్నా పరువాలేదు అని నాగ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Advertisement
సీనియర్ హీరోగా సినీ పరిశ్రమ ఇబ్బందుల గురించి మాట్లాడే బాధ్యత నాగార్జునకు ఉంది. నాగార్జున ఓ నిర్మాత కూడా. పరిశ్రమ ఇబ్బందుల గురించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే వ్యక్తుల్లో ముందుండే నాగార్జున ఏపీ ప్రభుత్వ ప్రతినిధులను కలిసినప్పుడు తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్‌తో సమావేశమైనప్పుడు నాగార్జున ఉన్నాడు. మరీ ఇప్పుడెందుకు ఈ కప్పదాటు వ్యవహారం.. సినిమా వేదికలపై రాజకీయం మాట్లాడను అన్నది నాగార్జున మాట.
Advertisement
Advertisement
సినిమా టికెట్ల ధరల గురించి సినిమా వేడుకలో మాట్లాడడం రాజకీయం ఎందుకు అవుతుంది. ఇప్పుడు రాంగోపాల్ వర్మ గొంతు చించుకుని ట్వీట్ చేస్తున్నాడు. అది రాజకీయమా..? నాని టికెట్ రేట్ల వ్యవహారంలో మాట్లాడడం రాజకీయమా.. బంగార్రాజు విడుదలవుతుంది. ఏమి మాట్లాడితే తన సినిమాకు ఏమవుతుందో అన్నది నాగార్జున భయం కావచ్చు. ఈ సినిమాను ముందే జీ సంస్థకు అమ్మేసాడు నాగార్జున. లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా తనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. అందుకే సైలెంట్‌గా తప్పుకున్నాడు. సీనీ పరిశ్రమ తరుపున నిలబడి మాట్లాడాల్సిన సందర్భంలో మౌనంగా ఉండి.. ధర ఎంత ఉన్నా పర్వాలేదని అనడం చిత్ర పరిశ్రమకు మేలు జరిగే విషయం ఎంత మాత్రం కాదు అని పలువురు సినీ ప్రముఖులు పేర్కొనడం గమనార్హం.