Home » బాలయ్య కొడుకు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే దర్శకుడు అతడేనా..?

బాలయ్య కొడుకు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే దర్శకుడు అతడేనా..?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. బాలయ్య ఇంత ఏజ్ వచ్చినప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కుర్రకారును మెప్పిస్తున్నారు. అయితే  దాదాపు ఐదారు ఏళ్ల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో పెండింగ్ వార్త ఏదైనా ఉందా అంటే.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ  మూవీ అనే చెప్పాలి. అదిగో వస్తుంది.. ఇదిగో వస్తుంది అని ప్రచారం జరుగుతుందే తప్ప మోక్షజ్ఞ మాత్రం ఇండస్ట్రీకి ఇంకా ఎంట్రీ ఇవ్వడం లేదు. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని.. వచ్చే సంవత్సరం విడుదలవుతుందని తాజాగా బాలయ్య చేసిన ప్రకటన అభిమానుల్లో ఆసక్తిని రేపింది.

Advertisement

ప్రధానంగా మోక్షజ్ఞ మొదటి మూవీని ఏ బ్యానర్ లో చేయబోతున్నారు..? నిర్మాత ఎవరు..? అతడిని పరిచయం చేసే దర్శకుడు ఎవరు ? అనేది కాస్త ఉత్కంఠగా మారింది. బాలయ్యకు సన్నిహితంగా వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. తనకు బాలయ్య కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తొలి సినిమా అవుతుందా? లేదంటే.. రెండో సినిమా అవుతుందా ? అనే దానిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుడు చేసే వారి పేర్లు పలువురిని వినిపిస్తూనే ఉన్నాయి. ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా ఉంటుందని.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపించాయి. ఇక ఆ తరువాత పూరి జగన్నాథ్ పేరు కూడా బయటికీ వచ్చింది. వారసులను చాలా గ్రాండ్ గా వెండితెరకు పరిచయం చేసారు. అదేవిధంగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను పేరు కూడా వినిపించింది. 

Advertisement

తాజాగా బాలయ్యతో భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి పేరు కూడా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ పటాస్ మూవీతో ప్రారంభించి తాజాగా భగవంత్ కేసరి మూవీ వరకు ఏడు వరుస సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి మూవీ షూటింగ్ సమయంలో అనిల్ వర్క్ నచ్చిన బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను అనిల్ కి అప్పగించారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి రెండు లైన్లు కూడా అనిల్ చెప్పారంటున్నారు. అనిల్ మీద మంచి నమ్మకంతో ఉన్న బాలయ్య ఎవ్వరికీ తన కొడుకును పరిచయం చేసే బాధ్యతను అప్పగిస్తారో వేచి చూడాలి మరీ. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading