సాధారణంగా చలికాలంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఎముకలు కొరికే చలిలో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో పలు సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి. శీతాకాలపు వ్యాధులను నివారించడం చాలా ఉత్తమమైన మార్గం. మన రోగ నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడం, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
Advertisement
చలికాలంలో కాలానికి అనుగుణంగా వ్యాధులను నివారించడంలో చేపలు మనకు ఎంతగానో ఉపయోగపడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. మీ ఆహారంలో చేపలను చేర్చుకుంటే అది పోషకాల లోపాన్ని తీర్చుతుంది. చేపల్లో ఒమేగా అధికంగా ఉండడం వల్ల పలు రకాల వ్యాధులను తరిమికొడుతుందంటున్నారు. ప్రస్తుతం వెంటాడుతున్న వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు అధిక పోషకాలు ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. చేపలు తినడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపాలను తీర్చుతుంది. అదేవిధంగా కంటిచూపును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ చలికాలంలో ట్యూనాఫిష్, సాల్మన్, మాకేరెల్ అవసరం.
Also Read : తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలో తెలుసా ?
Advertisement
ముఖ్యంగా చల్లని వాతావరణంలో చర్మ సమస్యలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో చర్మం పొడిగా మారుతుంది. అదేవిధంగా చర్మం గ్లో వచ్చే విధంగా చేస్తుంది. చేపల్లో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 గ్లోను తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతాయి. ఒమేగా 3 అధిక కొలెస్ట్రాల్ పై ప్రభావాన్ని చూపుతుంది. అదేవిధంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకి కూడా చాలా మేలు చేస్తాయి. దీనిని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇదే కాకుండా.. శరీరం వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడుతాయి. చలికాలంలో తరచుగా దగ్గు, జలుబు కి సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. శ్వాస సంబంధిత సమస్యల్లో కూడా ఇది తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒమెగా 3 శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.