Home » తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలో తెలుసా ?

తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలో తెలుసా ?

by Anji
Ad

ఔషదపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి తులసి మనందరి ఇండ్లలో ఉంటుంది. కానీ తులసి మొక్కను ఇంట్లో పెట్టుకునే వారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. షోడశోపచరా పూజా విదానంలో తులసికి విశిష్ట స్థానం ఉంది. విదేశీయులు సైతం తులసిలోని విశేషంను అంగీకరించనున్నారు. పరమ పవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్లల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడుతారు. తులసి మొక్క ఎండిపోయినప్పుడు అసలు ఏం చాయాలో అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 

Advertisement

తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి మొక్క ఎండిపోయినప్పుడు తొలగించడం చాలా ఉత్తమం. మా లక్ష్మి విష్ణువు కోపం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. దీంతో జీవితం పేదరికం, దు:ఖం, సమస్యలు చుట్టుపడుతుంది. సంప్రదాయాల ప్రకారం.. తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్లు అసంపూర్ణం అని భావిస్తారు. ఇలాంటి కుటుంబాల్లో తులసి ఓ ప్రత్యేకమైన స్థానంలో తులసికోట కట్టించి అందులో నాటుతారు. తులసికోటకు నలు వైపులా దేవతా చిత్రాలు ఉండి నాలుగు వైపులుగా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్లుంటాయి. కొన్ని ఇళ్లలో వరండాలో ఒక డజన్ వరకు తులసి మొక్కలు పెంచుతారు. చిన్నపాటి పొద మాదిరిగా పెరిగిన దీనిని తులసివనం లేదా తులసి బృందావనం అని పిలుస్తుంటారు. 

Advertisement

 

తులసికి నీటిని నైవేద్యంగా పెట్టి రోజు పూజిస్తే.. లక్ష్మి తల్లి ప్రసన్నరాలవుతుంది. మరోవైపు.. తులసి మొక్క ఎండిపోవడం కూడా పలు సూచనలను ఇస్తుంది. ఉదాహరణకు ఆకుపచ్చ తులసి అకస్మాత్తుగా ఎండిపోతే.. అది ఓ రకమైన సంక్షోభం లేదా డబ్బును కోల్పేయే అవకాశముంది. అలాంటి సమయంలో కొంత అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. కొన్నిసార్లు వాతావరణ ప్రభావం కారణంగా మొక్క ఎండిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో తులసి మొక్క ఏదైనా కారణం చేత ఎండిపోయినట్టయితే.. ఇలా అస్సలు వదిలేయకండి. వెంటనే వాటిని తొలగించండి. లేదంటే ఎండినటువంటి తులసి మొక్క పలు సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఎండు తులసి మొక్క అంటే అశుభం కలుగుతుంది. 

Also Read :  “వీర సింహ రెడ్డి” కి ఇదొక్కటే మైనస్ అయ్యిందా ?లేకుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదా ?

Visitors Are Also Reading