Home » హర్దిక్ పాండ్యా వెనక్కి రావడం పై బుమ్రా సెన్షేషన్ కామెంట్స్.. అసలు ఏం జరిగిందంటే..!

హర్దిక్ పాండ్యా వెనక్కి రావడం పై బుమ్రా సెన్షేషన్ కామెంట్స్.. అసలు ఏం జరిగిందంటే..!

by Anji
Published: Last Updated on

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ ను పరిగెత్తించిన కెప్టెన్. రెండు సార్లు ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఆరంభం నుంచే ఆ జట్టును విజయాల బాట నడిపించాడు. అయితే అంతకుముందు హార్దిక్ ముంబాయ్ కు ఆడేవారు. మధ్యలో అతను గాయాలబారిన పడ్డప్పుడు ముంబయ్ ఫ్రాంచీ పై అతన్ని వదిలించుకుంది. ఇప్పుడు మళ్లీ మళ్లీ బోలెడంత డబ్బు ఇచ్చి మరీ వెనక్కి రప్పించుకుంది. ఈ ట్రేడింగ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. ఐపీఎల్ చరిత్రలోనే హార్ట్ టాపిక్ గా కూడా నిలిచింది.

 


ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 15 కోట్లు ఇచ్చి హార్దిక్ పాండ్యాను తీసుకుంది. దీనికి అందరూ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది ఎవరంటే ఆ జట్టు స్టార్ బౌలర్, టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా. ఇతను మాత్రం తీవ్ర సంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీని వెనుక అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే కారణం అని చెబుతున్నారు. కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యుత్తమ సమాధానంగా నిలుస్తుంది అంటూ బుమ్రా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ టీ 20 లకు స్వస్తి పలకాలనే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హార్దిక్ తిరిగి ముంబైకి రావడంతో రోహిత్ తర్వాత అతనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతాడు. దీన్ని అఫీషియల్ గా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ అది ఖాయం అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ కారణమే బుమ్రా ను అసహనానికి గురిచేస్తోంది. రోహిత్ తర్వాత ముంబైకు బుమ్రా కెప్టెన్ కావాలనుకున్నాడు. అందుకే ఇన్నాళ్లు జట్టుతో ట్రావెల్ చేశాడు కూడా. అయితే ఇప్పుడు పాండ్యా తో బుమ్రా కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేసిన బుమ్రా ఆర్సీబీనీ ఫాలో అవుతున్నాడంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ముంబైని వదిలేసి ఆర్బీసీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి!

Visitors Are Also Reading