Home » భారత భవిష్యత్ కెప్టెన్లు వారే…!

భారత భవిష్యత్ కెప్టెన్లు వారే…!

by Azhar
Ad
భారత జట్టు ఈ ఏడాది మొత్తం ఏడుగురు కెప్టెన్ల కింద ఆడింది. సిరీస్ కో కెప్టెన్ చొప్పున మారుస్తుంది బీసీసీఐ. అందువల్ల బీసీసీఐపై విమర్శలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు భారత జట్టు యొక్క పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. కానీ రెస్ట్, గాయం అంటూ రోహిత్ జట్టుకు దూరంగా ఉండటం వల్ల సిరీస్ కో కెప్టెన్ ను మత్సాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈ తరుణంలోనే భారత జట్టు భవిష్యత్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న ఎక్కువగా వస్తుంది. అయితే గతంలో ఈ రేస్ లో రెండు మూడు పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు బీసీసీఐ చేసిన పని వల్ల చాలా పేర్లు వస్తున్నాయి.
ఒక్కో సిరీస్ కు ఒక్కో కెప్టెన్ ను చేయడం వల్ల రోహిత్ తర్వాత… కెప్టెన్ ఎవరు అయితే బాగుంటుంది అనే విషయంలో భారత సీనియర్ వెటరన్ ఆటగాడు.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న.. రాబిన్ ఊతప్ప క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా పాల్గొన ఊతప్ప ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అక్కడ అతనికి ఇదే ప్రశ్న ఎదురైంది. భారత భవిష్యత్ కెప్టెన్ ఎవరు అని అడగగా.. దానికి ఊతప్ప సమాధానం ఇస్తూ.. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ తర్వాత టీం ఇండియాకు టెస్టులో బుమ్రా కెప్టెన్ గా కావాలి అని పేర్కొన్నాడు.
ఇక వైట్ బాల్ ఫార్మటు కు కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ లలో ఒక్కరి కెప్టెన్ చేస్తే బాగుటుంది అని పేర్కొన్నాడు. అయితే ఈ కెప్టెన్ రేస్ లో రాహుల్ ముందునుండే ఉన్నాడు. కానీ ఈ మధ్యే ఐపీఎల్ సీజన్ తర్వాత రోహిత్ రెస్ట్ తీసుకొని.. రాహుల్ గాయపడటంతో రోషన్ కు కెప్టెన్ అవకాశం వచ్చింది. అలాగే ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్ కు ముందు రోహిత్ కరోనా బారిన పడటంతో బుమ్రాకు కెప్టెన్ చేసారు. అందువల్ల ఇప్పుడు ఈ రెండు పేర్లు కూడా కెప్టెన్సీ రేస్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి రోహిత్ తర్వాత ఆ భాష్యాథలు ఎవరికీ వస్తాయి అనేది.

Advertisement

Visitors Are Also Reading