Telugu News » Blog » “లైగ‌ర్” సినిమాను మిస్ చేసుకున్న ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేశారంటే.?

“లైగ‌ర్” సినిమాను మిస్ చేసుకున్న ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేశారంటే.?

by AJAY

సినిమా ఇండ‌స్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హీరో చేయ‌డం కామ‌న్. క‌థ న‌చ్చ‌కో ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో సినిమాలు చేతులు మారుతుంటాయి. రీసెంట్ గా విడుద‌లైన లైగ‌ర్ సినిమా కూడా ముందుగా టాలీవుడ్ లోని ఇత‌ర స్టార్స్ వ‌ద్ద‌కు వెళ్లిందే. ఈ సినిమాకు పూరీ జ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించాడు. పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

Advertisement

liger-movie-review

భారీ బ‌డ్జెట్ తో బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి పూరీ ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ, మైక్ టైస‌న్ లు ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. ఇదిలా ఉంటే ఆగ‌స్టు 25వ తేదీన విడుద‌లైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. థియేట‌ర్ల వ‌ద్ద సినిమా దారుణ మైన ట‌క్ ను వినాల్సి వ‌స్తోంది.

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాత్ మ‌రియు విజ‌య్ దేవ‌ర‌కొండ పై భారీ ఎత్తున ట్రోల్స్ కూడా వ‌స్తున్నాయి. సినిమాలో మైక్ టైస‌న్ పాత్ర కామెడీ అయ్యిందని…అస‌లు పాట‌లు ఎందుకు వ‌స్తాయో అర్థం కావ‌డంలేద‌ని ప్రేక్ష‌కులు వాపోతున్నారు. అంతే కాకుండా రొటీన్ క‌థ‌తో పూరీ మ‌రో సినిమా చేశాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా క‌థ‌ను టాలీవుడ్ లోని ప‌లువురు స్టార్స్ మిస్ చేసుకున్నారు. ఆ హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….ఈ సినిమా క‌థ‌ను మొద‌ట‌గా పూరీ జ‌గ‌న్నాత్ ఎన్టీఆర్ కు చెప్పార‌ట‌. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశార‌ట‌. ఆ త‌ర‌వాత పూరీ ఇదే క‌థ‌ను మ‌హేశ్ బాబు కు చెప్పారు.

కానీ సినిమా డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో ప్రిన్స్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా పూరీ త‌నయుడు ఆకాష్ పూరీ ఓ సినిమా ఫంక్ష‌న్ లో మా నాన్న ను నేను అడిగితే లైగ‌ర్ నాతోనే చేసేవాడు అని చెప్పాడు. ఒక‌వేళ అదే జ‌రిగితే పూరీ త‌న‌యుడి ఖాతాలో మ‌రో ఫ్లాప్ ప‌డేది. అలా ముగ్గురు మిస్ చేసుకున్న సినిమాలో విజ‌య్ న‌టించి ఆ ఫ్లాప్ ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

ALSO READ :  ఈ సినిమాను వదులుకొని ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట.. నవ్వుకున్న ఏఎన్ఆర్..!