Home » “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా..? ఏం చేస్తున్నాడంటే..?

“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా..? ఏం చేస్తున్నాడంటే..?

by AJAY
Ad

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన వాళ్ళు ఇప్పుడు హీరోలు హీరోయిన్లు గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు ఈ సినిమాలో నాగ అన్వేష్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ వెంకటేష్ కు కొడుకు పాత్రలో నటించాడు.

Also Read: వేణుమాద‌వ్ 10 ఎక‌రాల భూమితో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఒప్పందం ఏంటో తెలుసా…?

Advertisement

 

ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ మనీషాను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత వీరిద్దరికీ ఒక కుమారుడు పుడతాడు. ఇక అదే కుమారుడిని సౌందర్య వెంకటేష్ సౌందర్య దంపతులు దత్తత తీసుకుంటారు. అయితే ఆ తర్వాత మనిషాను కూడా వెంకటేష్ ఇంట్లోకి తీసుకోవచ్చు పెట్టడంతో అసలైన రచ్చ మొదలవుతుంది.

Advertisement

 

ఈ క్రమంలో చైల్డ్ ఆర్టిస్ట్ నాగ అన్వేష్ కామెడీ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ముద్దు ముద్దు మాటలతో నాగ అన్వేష్ తలలో మల్లెపూలు పెట్టాలి అనే డైలాగ్ చెబుతూ ఆకట్టుకుంటాడు. అతడి క్యూట్ మాటలకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాగ అన్వేష్ ను సినిమాలో ఎలా తీసుకున్నారు అనే విషయానికి వస్తె….అతడి తండ్రి కూడా సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్న సమయంలో ఇవివి సత్యనారాయణ నాగ అన్వేష్ నటనను చూసి ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ అన్వేష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఏంజిల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది.

ALSO READ : వేణుమాద‌వ్ 10 ఎక‌రాల భూమితో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఒప్పందం ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading