Home » Intinti Gruhalakshmi 06 May Today Episode : ఓ వైపు లాస్య ఉగ్ర‌రూపం.. మ‌రోవైపు తుల‌సి తెగింపు.. అంతలోనే అస‌లు ట్విస్ట్‌..!

Intinti Gruhalakshmi 06 May Today Episode : ఓ వైపు లాస్య ఉగ్ర‌రూపం.. మ‌రోవైపు తుల‌సి తెగింపు.. అంతలోనే అస‌లు ట్విస్ట్‌..!

by Anji
Ad

Intinti Gruhalakshmi 06 May Today Episode : మాటీవీలో ప్రసార‌మ‌వుతున్న సీరియ‌ల్స్‌లో ఇంటింటి గృహ‌ల‌క్ష్మి సీరియ‌ల్ ఒక‌టి. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఈ సీరియ‌ల్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రోజుకొక కొత్త క‌థ‌నంతో ఊహించ‌ని మ‌లుపుల‌తో వీక్ష‌కుల‌ను క‌ద‌ల‌నివ్వ‌కుండా చేస్తుంది. ఇలా ఉత్కంట‌భ‌రితంగా సాగుతున్న తరుణంలో తుల‌సి మొత్తం మారిపోయింది. ప్ర‌వ‌ళిక తుల‌సి క‌ట్టుబొట్టు మొత్తం మార్చేసింది. కానీ ఆమె మ‌న‌సు మాత్రం మార‌లేదు. ముఖ్యంగా గ‌త ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్ చూశాం.


మ‌ద‌ర్ థెరిసా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మాతృదినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతుండ‌గా.. బ‌య‌ట ప్ర‌వ‌ళిక, దివ్య, తుల‌సి కోసం వెయిట్ చేస్తుంటారు. తుల‌సి ఆటోల నుంచి అప్పుడే దిగుతుంది. తుల‌సితో పాటు అన‌సూయ‌, అన‌సూయ భ‌ర్త‌ కూడా వ‌స్తారు. వాళ్ల కారు అప్పుడే దిగివ‌చ్చి ఆగుతుంది. తుల‌సి వాళ్లు చూస్తుండ‌గానే లాస్య‌, నందుల‌తో పాటు లాస్య కొడుకు ల‌క్కి కారు దిగుతాడు. దిగ‌డం దిగడ‌మే తుల‌సిని చూసి ఆంటీ అంటూ ప‌రుగు తీస్తూ వ‌స్తాడు. తుల‌సి కూడా అంతే ప్రేమ‌గా ల‌క్కీని ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముద్దాడుతుంది. అది చూసి ప్ర‌వ‌ళిక మురిసిపోతుంది. లాస్య ర‌గిలిపోతుంది. వెంట‌నే కొడుకు ల‌క్కితో నిన్ను హాస్ట‌ల్ నుంచి తీసుకొచ్చింది నాతో ఉండ‌డానికి అని కోపంగా అంటుంది.

Advertisement

Advertisement

 

తుల‌సి ఆంటి అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఇష్టం లేక‌పోతే నువ్వు మాట్లాడ‌కు అని ల‌క్కి అంటాడు. దీంతో లాస్య ఈగో దెబ్బ‌తింటుంది. వెంట‌నే కోపంగా ఏమిట్రా ఆ పొగ‌రు.. కొట్టానంటేనా.. అంటూ ల‌క్కీ మీద‌కు దూసుకుపోతుంది లాస్య‌. వెంట‌నే తుల‌సి అడ్డుప‌డుతుంది. లాస్య అని అరుస్తూ లాస్య చేతిని ప‌ట్టుకుంటుంది. ఇదంతా గ‌త ప్రోమోలో ట్విస్ట్. లాస్య చేతిని అడ్డుకున్న తుల‌సి లాస్య‌కు ఎలా బుద్ది చెప్పింద‌ని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలోనే ఇవాళ నిరాశ ఎదురైందనే చెప్పాలి. హాట్‌స్టార్‌లో ఉండాల్సిన ఇంటింటి గృహ‌ల‌క్ష్మి లేక‌పోవ‌డం విశేషం. ఎపిసోడ్ పోస్ట్ చేయ‌డానికి కావాల‌నే ఆల‌స్యం చేస్తున్నారా.. మ‌రేదైనా సాంకేతిక స‌మస్య త‌లెత్తిందా..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Also Read : 

Janaki Kalaganaledu 06 May Today Episode : క‌న్న‌బాబు వ‌ల‌లో చిక్కిన రామా.. జ్ఞానాంబకు అస‌లు విష‌యం చెబుతాడా..?

Karthika Deepam 6 May Today Episode : జ్వాల‌కు సాయం చేసిన సౌంద‌ర్య‌.. త‌నే శౌర్య అని తెలుసుకుంటుందా..?

 

Visitors Are Also Reading