Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Karthika Deepam 6 May Today Episode : జ్వాల‌కు సాయం చేసిన సౌంద‌ర్య‌.. త‌నే శౌర్య అని తెలుసుకుంటుందా..?

Karthika Deepam 6 May Today Episode : జ్వాల‌కు సాయం చేసిన సౌంద‌ర్య‌.. త‌నే శౌర్య అని తెలుసుకుంటుందా..?

by Anji
Ads

Karthika Deepam 6 May Today Episode : సాయంత్రం స‌మ‌యం అయిందంటే చాలు.. ముఖ్యంగా మ‌హిళ‌లు టీవీలో కార్తీక దీపం సీరియ‌ల్ చూడ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. ఇక ఇవాళ అన‌గా మే 06, 2022 శుక్ర‌వారం 1345వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. జ్వాల స‌త్యం కోసం బిర్యాని తీసుకొని వ‌స్తుంది. ఇదే స‌మ‌యంలో ప్రేమ్ వెంట‌నే హిమకు ఫోన్ చేసి బిర్యాని తిన‌డానికి వ‌స్తావా అని అడుగుతాడు. నిరుప‌మ్ కూడా వ‌స్తున్నాడ‌ని ప్రేమ్ చెబుతాడు. వెంట‌నే వ‌స్తాన‌ని హిమ చెబుతుంది. నా బిర్యాని తిన‌డం కోసం తింగ‌రితో పాటు డాక్టర్ సాబ్ కూడా వ‌స్తున్నాడ‌ని ప్రేమ్ జ్వాలతో చెబుతాడు. మ‌రొక‌వైపు కార్తీక్, దీప ఫోటో చూసి మీరేమో మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోయార‌ని బాధప‌డుతుంటుంది సౌంద‌ర్య‌. ఇక ఆదిత్య అమెరికా వెళ్లాడు. ఉన్న స్వ‌ప్న త‌న జీవితాన్ని చేజేతురాల నాశ‌నం చేసుకుంటుంద‌ని సౌంద‌ర్య పేర్కొంటుంది.

Advertisement

Ad

ఇక రేపు స్వ‌ప్న‌, స‌త్యంల 25వ పెళ్లి రోజు. అంతా బాగుంటే అంద‌రం క‌లిసుంటే ఈ ఇంట్లో ఫంక్ష‌న్‌ను పెద్ద పండుగ‌లా చేసే దాన్ని. ఏమి లాభం. స్వ‌ప్న ఒక చోట స‌త్యం ఒక‌చోట‌. మ‌న కుటుంబానికి ఏ శాపం త‌గిలిందో ఏంటో పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే నువ్వు, దీప విడిపోయారు. ఇప్పుడు స‌త్యం, స్వ‌ప్న కూడా అదేవిధంగా త‌యారయ్యారు. భార్య‌, భ‌ర్త‌ల‌కు విడివిడిగా శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మనేది ఎంత అస‌హ‌జంగా ఉంటుందో క‌దా. స్వ‌ప్న మారితే బాగుండు. ఈ పెళ్లి రోజు అయినా క‌లిసి చేసుకుంటే బాగుండ‌ని అనుకుంటుంది సౌంద‌ర్య‌. ఇంత‌లో అక్క‌డికి హిమ వ‌స్తుంది. నేను స‌త్యం మామ‌య్య వాళ్ల ఇంటికి వెల్తున్నాను అంటుంది హిమ‌. డిన్న‌ర్ కు వెళ్లుతున్నాన‌ని చెబుతుంది.

అవును అమ్మ అంద‌రూ క‌లిసుకుంటే బాగుంటుంది. కానీ క‌లుసుకోవాల‌ని అంద‌రికీ ఉండాలి క‌దా.. వెళ్లిపోయిన శౌర్య ఎప్పుడు కలుస్తుందో దూరం దూరంగా ఉన్న స‌త్యం, స్వ‌ప్న‌లు ఎప్పుడు క‌లుస్తారో అని అనుకుంటుంది సౌంద‌ర్య‌. మ‌రొక వైపు నిరుప‌మ్‌, హిమ బిర్యాని తిన‌డం కోసం స‌త్యం ఇంటికి వెళ్తారు. నిరుప‌మ్ కే బిర్యానిని ఎక్కువ‌గా వ‌డ్డిస్తుంటుంది జ్వాల‌. తాను చేస్తున్న ప‌ని చూసి అంద‌రూ న‌వ్వుకుంటారు. నిరుప‌మ్ బిర్యాని తింటుంటే.. త‌న‌ను చూస్తుంటుంది జ్వాల‌. బిర్యాని అదిరిపోయింది జ్వాల‌. చాలా బాగుందంటాడు నిరుప‌మ్‌. హ‌లో బ్ర‌ద‌ర్స్ బిర్యాని త‌ను చేసి ఉండ‌దు లే. వాళ్ల పిన్ని చేసి ఉంటుందంటాడు ప్రేమ్.

డాక్ట‌ర్ సాబ్ న‌న్ను పొగిడితే నీకేంటి క‌డుపు మంట అంటుంది జ్వాల‌. నిజంగా బిర్యాని చాలా బాగుంద‌ని హిమ అంటుంది. ఇద్దిరికీ తేకుండా ఎక్కువ తీసుకొచ్చింది నేను. ఇవ‌న్నీ నీకు తెలియ‌దు క‌దా ఎక్స్ ట్రా అంటుంది జ్వాల. మ‌నంద‌రం క‌లిసి తిన్న‌విధంగానే మ‌మ్మి డాడీల‌తో క‌లిసి తినాలంటాడు నిరుప‌మ్. మ‌మ్మీ, డాడీ మ‌నంద‌రం క‌లిసి పోవాలి. దీని కోసం ఆలోచించు అంటాడు నిరుప‌మ్‌. మామ‌య్య ఏంటి ఇంకా రాలేదు అని హిమ అంటుంది. ఇంత‌లోనే స‌త్యం వ‌స్తాడు. నువ్వు కూడా కూర్చో అని నిరుప‌మ్ అంటాడు. దీంతో ప‌ర్వాలేదు డాక్ట‌ర్ సాబ్ అంటుంది. బిర్యాని ఉంది క‌దా అని స‌త్యం ఓ పెగ్ వేసి వ‌స్తాడు. అంద‌రితో ప్రేమ‌గా మాట్లాడుతుండ‌డంతో షాక్ అవుతాడు. జ్వాల‌ను కూడా బంగారం అని పిలుస్తాడు స‌త్యం. నిరుప‌మ్ ఆయ‌న లోకం ఆయ‌న‌ద‌ని అనుకుంటాడు. ఎలాగైనా అమ్మ‌నాన్న‌ను క‌ల‌పాలి. ఈ విష‌యంలో జ్వాల హెల్ప్ తీసుకోవాల‌ని నిరుప‌మ్ అనుకుంటాడు.


మ‌రొక‌వైపు నిరుప‌మ్‌, జ్వాల‌కు పెళ్లి జ‌రిగిన‌ట్టు క‌ల‌గంటుంది జ్వాల‌. త‌న‌కు బిర్యాని వండిస్తున్న‌ట్టు క‌ల‌గంటూ.. నిరుపమ్ కు బిర్యాని ఎక్కువ‌గా వ‌డ్డిస్తుంది జ్వాల‌. అంత నిరుపమ్ కు వ‌డ్డిస్తావా కొంచెం మాకు కూడా వ‌డ్డించు అంటుంది హిమ‌. మ‌మ్మీ డాడీ గురించి ఆలోచించాలి అంటాడు నిరుప‌మ్‌. వాళ్లిద్ద‌రినీ క‌లిపితే భవిష్య‌త్‌లో హ్యాపీగా ఉంటామ‌ని నిరుప‌మ్ అంటాడు. స‌రే ముందు బిర్యాని తిను. ఆ త‌రువాత మాట్లాడుకుందామ‌ని ప్రేమ్ అంటాడు. ఈ తిక్క ముందు ఇంటి విష‌యాలు మాట్లాడుకోవ‌డం ఎందుక‌ని అనుకుంటాడు ప్రేమ్‌. ఇక స్వ‌ప్న‌, స‌త్యం ఫంక్ష‌న్ గురించి ప్రేమ్‌, హిమ‌తో మాట్లాడుతుంది సౌంద‌ర్య‌. పెళ్లి రోజు ఫంక్ష‌న్‌కు మీ మ‌మ్మిని ఎలా ఒప్పించాల‌ని సౌంద‌ర్య అంటుంది. నిరుప‌మ్ మ‌మ్మిని ఒప్ప‌స్తా అంటాడు. ఏదో ఒక ర‌కంగా అత్త‌య్య‌ను ఒప్పిస్తాడ‌నే న‌మ్మ‌కం నాకు ఉంది అంటుంది హిమ‌. వారి పెళ్లిరోజును ఇక్క‌డే ప్లాస్ చేద్దామంటుంది హిమ‌.


మ‌రొక వైపు చెత్త కాగితాల షాపు వ‌ద్ద‌కు వెళ్లి 10 కేజీల వేస్ట్ పేప‌ర్స్ కావాలంటుంది జ్వాల‌. దీంతో వేస్ట్ పేప‌ర్స్ తూకం వేస్తుంటాడు. అక్క‌డే గీత గీసిన బొమ్మ‌లు కూడా ఉంటాయి. అప్పుడే అక్క‌డికి సౌంద‌ర్య కారులో వ‌చ్చి జ్వాల‌ను చూస్తుంది. ప‌నికి వ‌చ్చే పేప‌ర్స్ ఇవ్వు.. చిత్తు కాగితాలు అన్నారు. కానీ చెత్త కాగితాలు అన‌లేదు క‌దా అంటుంది. ఇంత‌లో జ్వాల ఆటోలోకి ఓ దొంగ దూరి త‌న ఆటోలో ఉన్న డ‌బ్బులు దొంగిలించ‌డం సౌంద‌ర్య చూస్తుంది. వెంట‌నే కారు దిగి అతడిని ప‌ట్టుకొని దొంగ వెద‌వ అని తిట్టి డ‌బ్బులు లాక్కుంటుంది. ఇంత‌లోన జ్వాల వ‌స్తుంది. నీ డ‌బ్బులు వీడు దొంగిలించాడంటుంది. ఏంట్రా ఇలా చేశావు అంటే.. త‌ప్ప‌యింది అక్క అంటాడు. దీంతో త‌న‌కు కోపం వ‌చ్చి చెంప చెళ్లుమ‌నిపిస్తుంది. ఆ త‌రువాత వాడికి కొంత డ‌బ్బు ఇచ్చి తిన్నావో లేదో తినుపో అంటుంది. త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో తెలుసుకోవాల్సిందే.

Also Read : 

Chanakya Niti : ఈ ప‌నులు చేసిన వెంట‌నే స్నానం త‌ప్ప‌కుండా చేయాలి..!

Advertisement

VishwekSen : “అశోకవనంలో అర్జున కళ్యాణం” ట్విట్టర్ రివ్యూ….!

Visitors Are Also Reading