Telugu News » Blog » Janaki Kalaganaledu 06 May Today Episode : క‌న్న‌బాబు వ‌ల‌లో చిక్కిన రామా.. జ్ఞానాంబకు అస‌లు విష‌యం చెబుతాడా..?

Janaki Kalaganaledu 06 May Today Episode : క‌న్న‌బాబు వ‌ల‌లో చిక్కిన రామా.. జ్ఞానాంబకు అస‌లు విష‌యం చెబుతాడా..?

by Anji
Ads

Janki Kalaganaledu 06 May Today Episode : మాటీవీలో ప్రసార‌మ‌య్యే జాన‌కి క‌ల‌గ‌న‌లేదు సీరియ‌ల్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రోజుకొక కొత్త క‌థ‌నంతో ఊహించ‌ని మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటూ.. ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఈ సీరియ‌ల్‌లో తాజాగా ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామా ఎప్పుడు ఇంత బాధ‌ప‌డ‌డం చూడ‌లేద‌ని.. నీవ‌ల్లే నా కుమారుడు వేద‌న అనుభ‌విస్తునాడ‌ని జాన‌కికి చుక్క‌లు చూపిస్తుంది జ్ఞానాంబ‌. నా కొడుకుకు ఈ ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం నువ్వు.. నీ చ‌దువు.. మీ అన్న‌య్య అహంకార‌మే అని జ్ఞానాంబ అన‌డంతో జాన‌కి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మ‌ల్లిక భ‌ర్త‌తో క‌లిసి మార్కెట్‌లోకి వెళ్తుంది. అదే స‌మ‌యంలో మ‌ల్లిక కంట‌ప‌డ‌తాడు రామా. అత‌ను ఫైనాన్స్ కంపెనీలోకి వెళ్ల‌డం చూసి విష్ణు ద‌గ్గ‌ర గోల చేస్తుంది. ఫైనాన్స్ ఆఫీస్‌కు వెళ్తున్నాడంటే.. ఆ కంపెనీలో ఏదో వాటా వాడి ఉండి ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తుంది మ‌ల్లిక‌.

Advertisement


ఇక రామా.. ఫైనాన్స్ కంపెనీలోకి వెళ్లిన రామా.. త‌న‌కు రూ.ల‌క్ష అప్పుగా కావాల‌ని అడుగుతాడు. ఇంటికి రాగానే విష‌యాన్ని డైరెక్ట్‌గా చెప్ప‌కుండా విష్ణుని వంక‌పెట్టి ఆ విష‌యం మ‌న‌కెందుకు అండి మీరు ఊరుకోండి. అది మ‌నీ మ్యాట‌ర్ క‌దా. మ‌న‌కెందుకు అని చెప్పి చెప్ప‌న‌ట్టు న‌సుగుతూ ఉంటుంది. దీంతో జ్ఞానాంబ ఏయ్ ఇటు రా.. ఏం మాట్లాడుతున్నావు. రామా ఎక్క‌డికి వెళ్లాడు. ఏం చెప్పాల‌నుకుంటున్నావు. అని అడుగుతుంది. దీంతో మ‌ల్లిక బావ‌గారు ఫైనాన్స్ షాపున‌కు వెళ్లారు అత్త‌య్య గారు. ఫైనాన్స్ వాళ్ల‌తో చాలా సేపు మాట్లాడాడు. అప్పు కోసం వెళ్లారో లేదంటే.. పెట్టుబ‌డి పెడుతున్నా ఆ మంతనాలు ఏంటో పాపం పుణ్యం అంతా పై వాడికే తెలియాల‌ని మల్లిక అంటుంది. నేనే కాదు మీ అబ్బాయి కూడా చూశాడంటూ.. విష్ణు ద‌గ్గ‌ర‌కు వెళ్లి బ‌ల‌వంతంగా లాక్కొస్తుంది మ‌ల్లిక‌.

Advertisement


మీరు ఏం చూశారో చెప్పండి అని మ‌ల్లిక అన‌డంతో విష్ణు అవున‌మ్మా ఫైనాన్స్ కంపెనీకి అన్న‌య్య వెళ్లాడ‌ని చెబుతాడు. అదే స‌మ‌యంలో రామా వ‌చ్చే స‌రికి రామా వాళ్లు చెప్పేది నిజ‌మేనా.. నువ్వు ఫైనాన్స్ కంపెనీ వ‌ద్ద‌కు వెళ్లావు ఎందుకు..? డ‌బ్బు కోసం వెళ్లావా..? నిజం చెప్ప‌ని జ్ఞానాంబ నిల‌దీస్తుంది. దీంతో రామా వెళ్లాన‌ని ఒప్పుకుంటాడు. నేను ఫైనాన్స్ షాపు వ‌ద్ద‌కు వెళ్లింది నిజ‌మే. డ‌బ్బుల కోస‌మే.. కానీ నాకు కాదు.. నా ఫ్రెండ్ డ‌బ్బులు కావాలంటే మాట సాయంగా వెళ్లాను. డ‌బ్బు నాకు అవ‌స‌రం ఉంటే నిన్నే అడుగుతాను కాద‌మ్మా అంటాడు. ఆ మాట‌తో జ్ఞానాంబ నీకు డ‌బ్బు అవ‌స‌రం పడి న‌న్ను అడ‌గ‌డం లేదేమో అనుకున్నా.. నీకెప్పుడూ ఎంత కావాల‌న్నా అడిగి తీసుకో.. అంతే త‌ప్ప అప్పులు చేసి ఇబ్బంది ప‌డ‌కు అని రామాకు చెబుతుంది జ్ఞానాంబ‌. అయితే రామా ఫైనాన్స్ షాపు వ‌ద్ద‌కు వెళ్లింది.


అప్పు కోస‌మేన‌ని జాన‌కి ప‌సిగ‌డుతుంది. మీరు అప్పుకోస‌మే వెళ్లారు క‌దా.. నాఫీజు చెల్లించ‌డం కోసం అప్పు చేస్తున్నారు. ఇబ్బందులు ప‌డుతున్నాడు. నాకు ఐపీఎస్ చ‌దువు వ‌ద్దు.. ఏం వ‌ద్దు.. నా కార‌ణంగా నా భ‌ర్త వేరే వాళ్ల ముందు చేయిచాచ‌డం దోషిగా నిల‌బ‌డ‌డం నాకు ఇష్టం లేదు. ద‌య‌చేసి ఇంత‌టితో ఆపేయండి. నా భ‌ర్త‌ను ఇబ్బందుల పాలు చేసే క‌ల నాకు వ‌ద్ద‌ని జాన‌కి అంటుంది. వ‌డ్డీ వ్యాపారి ఎవ‌రో కాదు.. కార్పొరేట‌ర్ సునందాదేవి అబ్బాయి క‌న్న‌బాబు సెట్ చేసిన వాడే. రామాని దెబ్బ కొట్ట‌డానికి ప్రామిస‌రి నోటు పై సంత‌కాలు పెట్టించుకొని మ‌రొక కుట్ర‌కు తెర‌తీశాడు క‌న్న‌బాబు. ఇక మిగిలిన అంశాలు రేప‌టి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Also Read : 

Karthika Deepam 4 May Today Episode : జ్వాల‌కు సాయం చేసిన సౌంద‌ర్య‌.. త‌నే శౌర్య అని తెలుసుకుంటుందా..?

Advertisement

స‌మంత పోస్ట్ కు ల‌వ్ యూ టూ అంటూ ప్రీత‌మ్ కామెంట్…ఆ పిలుపుతో రిలేష‌న్షిప్ పై క్లారిటీ..!