కృష్ణవంశీ సినిమా అంటే అందులో తప్పకుండా కుటుంబ నేపథ్యం ఉంటుంది. దాదాపుగా ఎక్కువ శాతం ఫ్యామిలీకే ఎక్కవ ప్రాధాన్యతను ఇస్తారు దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తెరకెక్కించిన చిత్రం ఖడ్గం.2002లో వచ్చిన ఈ సినిమా భారత్‌లో హిందూ, ముస్లింల మధ్య స్నేహబంధం నేపథ్యంలో తెరకెక్కించారు. దేశంజోలికి వస్తే.. అందరం ఒక్కటవుతామంటూ తెలిపే సందేశంతో రూపొందించారు.
Advertisement
ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను కురిపించింది. ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు సైతం దక్కాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత వీరు ముగ్గురు హీరోయిన్లుగా నటించారు.
Also Read: ఆ హీరోయిన్ నటనకు త్రివిక్రమ్ ఫిదా…మహేష్ బాబు పక్కన ఛాన్స్…!
Advertisement
అయితే ఖడ్గం సినిమాలో సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా అవకాశాల కోసం పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి పాత్రను పోషించింది. ఈ సినిమాలో దర్శకుడు బెడ్రూమ్లోకి వెళ్లాల్సిన సీన్ ఉన్నది. సంగీత రవితేజను ఇష్టపడుతుంటుంది. అయితే సంగీత అమ్మ అయిన పావలా శ్యామల తన కూతురును హీరోయిన్ చేయాలన్న కోరికతో ఆమె బలవంతంతో అయిష్టంగానే సంగీత ఆ దర్శకుడితో రూమ్‌లోకి వెళ్లుతుంది. ఆ దర్శకుని ఒడిలో కూర్చొని అతనికి మందు తాగిస్తుంటుంది. అప్పుడు రవితేజ తలుపు తోసుకు వచ్చి ఆ సీన్ చూసి విలవిల్లాడిపోతాడు.
సినిమా రంగంలో సహజంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితే ఉంటుందని కృష్ణవంశీ కూడా అందుకే ఆ సీన్ పెట్టారని అప్పట్లో టాక్ వినిపించింది. టాలీవుడ్లో ఓ సీనియర్ దర్శకుడిని టార్గెట్ చేసే కృష్ణవంశీ కావాలనే ఈ సీన్ పెట్టారని టాక్. మరొక వైపు హీరోయిన్ రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్ ఓ దర్శకుడు ఇబ్బంది పెట్టిన తరుణంలో కృష్ణవంశీ కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ.. ఖడ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశారని కూడా ప్రచారం అయింది. ముఖ్యంగా రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ నటి స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే తప్పకుండా దర్శక, నిర్మాతలకు లొంగిపోవాల్సిందే అని.. వారు రమ్మన్న గదుల్లోకి వెళ్లాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు కూడా చేసారు. ఖడ్గంలో ఉన్న ఆ సీజ్ వెనుక ఆంతర్యం ఏమిటో దర్శకుడు కృష్ణవంశీకే తెలియాలి.
Also Read: రవితేజ ఖిలాడి నుంచి ఊరమాస్ తో ఫుల్ కిక్కు..!