Home » ర‌వితేజ ఖిలాడి నుంచి ఊర‌మాస్ తో ఫుల్ కిక్కు..!

ర‌వితేజ ఖిలాడి నుంచి ఊర‌మాస్ తో ఫుల్ కిక్కు..!

by Anji
Ad

ఇవాళ మాస్ మ‌హారాజా ర‌వితేజ పుట్టిన రోజు, ఈ సంద‌ర్భంగా ఉద‌యం నుంచి ర‌వితేజ న‌టిస్తున్న ప‌లు చిత్రాల నుంచి వ‌రుస‌గా అప్‌డేట్స్ ఇచ్చి అభిమానుల‌ను ఫుల్ ఖుషి చేశారు. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధ‌మాకా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ మూడు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న త‌రువాత ర‌వితేజ ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇవాళ ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఖిలాడి సినిమా నుంచి మ‌రొక స్పెష‌ల్ ట్రీట్ వ‌చ్చేసింది.

తగ్గేదే లే అంటున్న 'ఖిలాడి'!

Advertisement

Advertisement

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌లో డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఖిలాడి. ఈ చిత్రాన్ని ఏ స్టూడియేస్‌, ఎల్ఎల్పీ బ్యాన‌ర్ల‌పై స‌త్యనారాయ‌ణ కోనేరు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ కిక్కు సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పాట పూర్తిగా మాస్ యాంగిల్‌లో ఉన్న‌ది. అదేవిధంగా మ‌రొక‌సారి ర‌వితేజ త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. ఈ పాట‌తో సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసారు మేక‌ర్స్‌. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ముఖ్యంగా అర్జున్‌, అన‌సూయ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

Visitors Are Also Reading