Home » ఆ హీరోయిన్ నటనకు త్రివిక్రమ్ ఫిదా…మహేష్ బాబు పక్కన ఛాన్స్…!

ఆ హీరోయిన్ నటనకు త్రివిక్రమ్ ఫిదా…మహేష్ బాబు పక్కన ఛాన్స్…!

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో మలయాళ బ్యూటీల హవా నడుస్తుంది. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ తో పాటు చాలా మంది మలయాళీ ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాతో మరో మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భీమానాయక్ సినిమాలో రానాకు భార్యగా ఈ ముద్దుగుమ్మ నటించింది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్త నటన చూసి ఆశ్చర్యపోయారట. ఇప్పటికే ఈ సినిమా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చూశారు.

Advertisement

Samyuktha menon

ఈ సినిమాలో ఆమె నటన చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఆయన సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు చెల్లెలుగా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వరకూ నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading