Home » బి, సి సెంటర్స్లో  బాలయ్య బాబు సృష్టించిన ప్రభంజనం ఊర మాస్ కి కేర్ అఫ్ అడ్రెస్స్ ఆ సినిమా !

బి, సి సెంటర్స్లో  బాలయ్య బాబు సృష్టించిన ప్రభంజనం ఊర మాస్ కి కేర్ అఫ్ అడ్రెస్స్ ఆ సినిమా !

by Azhar
Ad
ప్రస్తుతం మన తెలుగు హీరోలలో ఎవరికీ లేని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ. గత ఏడాది విడుదలైన అఖండ ఆ విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. బాలయ్యకు ఇంత మాస్ ఇమేజ్ రావడానికి కారణం ఆయన గతంతో చేసిన సినిమాలు. అయితే బాలయ్యకు ఈ మాస్ ఇమేజ్ మొదలయింది మాత్రం 1990 లో వచ్చిన లారీ డ్రైవర్ సినిమాతో. ఆ సినిమాకు సంబధించిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం..!
స్టేట్ రౌడి సినిమాతో మాస్ డైరెక్టర్ గా మారారు బి.గోపాల్. దాంతో ఆయనను రావు గోపాల్ రావు పట్టుకొని తర్వాతి సినిమా తన బ్యానర్ లో చేయాలని కోరారు. ఆయన ఒప్పుకున్నారు. ఆ తర్వాత హీరో బాలయ్యను కూడా ఒప్పించారు రావు గోపాల్ రావు. ఆ వెంటనే వీరి కాంబినేషన్ కు తగ్గట్లుగా కథను సిద్ధం చేసుకొని… హీరోయిన్ గా కొంత మాస్ ఇమేజ్ ఉన్న విజయశాంతిని తీసుకున్నారు. ఈ సినిమా ముందు వరకు బాలయ్యకు సరైన హిట్ లేదు. దాంతో ఆయన ఆశలు అన్ని దీనిపైనే పెట్టుకున్నారు.
ఇక కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా.. ఊర మాస్ ను జత చేయడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లోనే కేవలం వారం రోజుల్లో కోటి రూపాయలు వాసులు సాధించింది. ఇక 42 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 8 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading