Home » తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన.. స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..!!

తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన.. స్టార్ హీరోల సినిమాలు.. ఏంటంటే..!!

Published: Last Updated on
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో కొంతమంది హీరోలు దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు.

tollywood-disaster-movies

tollywood-disaster-movies

అంతే స్పీడుగా కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయి వారి ఖాతాలో నిలుస్తున్నాయి. అయితే ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఆచార్య దాని ప్లేస్ లో వచ్చే అవకాశం ఉంది. అయితే భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన సినిమాలు ఏంటో కొన్ని చూద్దాం..!!రాధేశ్యాం : ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యాం సినిమా ప్రపంచ మొత్తంలో 200 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 106 కోట్లు వస్తే కానీ సేవ్ అవ్వదు. హిందీలో 52 కోట్లకు అమ్మారు. ఈ మూవీ లక్ష్యానికి 120 కోట్ల రూపాయల దూరంలో ఆగిపోయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు.ఆచార్య : రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించిన మూవీ ఆచార్య. ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లోకి వచ్చి ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దాదాపు 132 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ 45 కోట్ల షేర్ ని రాబట్టింది. అంటే దాదాపు 80 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది రెండవ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది అని చెప్పవచ్చు.అజ్ఞాతవాసి : త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మూవీ అజ్ఞాతవాసి. ఈ మూవీ 70 కోట్ల బడ్జెట్ తో వచ్చింది. 123 కోట్లకు అమ్మారు. ఇది మొత్తం 57 కోట్లు మాత్రమే వసూలు చేసి దాదాపు 67 కోట్ల వరకు నష్టం వాటిల్లి డిజాస్టర్ గా నిలిచింది.మహా నాయకుడు : ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా 51 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఐదు కోట్ల రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.సర్దార్ గబ్బర్ సింగ్ :బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీకి 32 కోట్లు ఖర్చు అయింది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 84 కోట్లు.. కానీ సినిమా మాత్రం 37 కోట్ల నష్టాలను తీసుకువచ్చింది.

Advertisement

Advertisement

ALSO READ :

“ఆచార్య” సినిమాకి మొదట అనుకున్న కథ ఇదేనా ? ఇది తీసుకుంటే బ్లాక్ బస్టర్ పక్కా పడేది..!

పెళ్లి గురించి మాట్లాడమని వివరాలు పంపితే.. అబ్బాయి ని ఇంటర్వ్యూ చేసిన యువతి..!

Visitors Are Also Reading