Home » తెలంగాణ:నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఇంటర్ బోర్డు..?

తెలంగాణ:నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఇంటర్ బోర్డు..?

Ad

ఇంకో కొన్ని గంటల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటిలాగే ఈ సారి నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్స్ కి ఎంట్రీ లేదని అధికారులు చెప్పేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.

విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,07,394 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,64,626 ఉండగా సెకండియర్ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. వీరిలో 94,984 ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 1443 సెంటర్లను ఏర్పాటు చేశారు.

Advertisement

Advertisement

 

విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరుతో పాటు ప్రతి అంశాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మాస్ కాపీయింగ్ కు ఎక్కడ కూడా తావులేకుండా 25,513 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. 75 మంది ప్లేయింగ్ కార్డ్స్, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్ ను నియమించారు. వేసవికాలం దృష్ట్యా సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Visitors Are Also Reading