Home » Instagram : భార‌త్‌లో అందుబాటులోకి పెయిడ్ స‌బ్ స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌..!

Instagram : భార‌త్‌లో అందుబాటులోకి పెయిడ్ స‌బ్ స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌..!

by Anji
Ad

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టివ‌ర‌కు అకౌంట్ల‌ను యాక్స‌స్ చేయాలంటే ఎలాంటి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే కొన్ని అకౌంట్‌ల‌ను మాత్రం యాక్సెస్ చేసుకోవాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ ఇప్ప‌టికే ఇలాంటి ఆప్ష‌న్ ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిన‌దే.

Instagram launches anti-abuse feature; here's all you need to know -  Information News

Advertisement

ఫేస్‌బుక్ పెయిడ్ స‌బ్ స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌తో ఫేస్‌బుక్ పేజీల‌కు నెల‌కు కొంత మొత్తంలో చెల్లించి స‌బ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కుల అకౌంట్ల‌కు ఇప్ప‌టికే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Advertisement

ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్లో సైతం ఇలాంటి ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిందంటే ఇక‌పై క్రియేటివ్ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసే వారు డ‌బ్బులు సంపాదించుకునే అవ‌కాశం ఉండ‌నున్న‌ద‌న్న‌మా. ఇప్ప‌టికే అమెరికాలో కొంద‌రు క్రియేట‌ర్స్ కోసం ఈ ఆప్ష‌న్‌ను అందించింది ఇన్‌స్టాగ్రామ్‌. తాజాగా భార‌త్‌లో తీసుకొచ్చింది. కొంద‌రు క్రియేట‌ర్లు పోస్ట్ చేసే ఎక్స్‌క్లూజివ్ పోస్టులు, వీడియోల‌ను చూడాలంటే.. స‌ద‌రు క్రియేట‌ర్ అకౌంట్‌కు స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రియేట‌ర్స్‌కు ఉన్న ఫాలోయింగ్ ఆధారంగా ఆ ఆప్ష‌న్‌ను ఇస్తారు. ఇక రూ.89 నుంచి రూ.890 వ‌ర‌కు చెల్లించి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం క్రియేట‌ర్స్‌కు స‌బ్ స్క్రిప్ష‌న్ ఫీచ‌ర్‌ను సెట్ చేసుకునే అవ‌కాశం లేదు. అయితే త్వ‌ర‌లోనే క్రియేట‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానున్న‌ది.

Visitors Are Also Reading