Home » రైలు కూత వెనుక ఇంత అర్థం ఉందా..?

రైలు కూత వెనుక ఇంత అర్థం ఉందా..?

by Anji
Ad

మీరు రైళ్ల‌లో ప్ర‌యాణించే ఉంటారు. అయితే ఈ రైల్లు ఎందుకు కూతులేస్తాయి. ట్రాక్‌పై ఒకే రైలు ఒకేదిశ‌లో న‌డుస్తున్న‌ప్పుడు ఈ డ్రైవ‌ర్లు ఎందుకు హార‌న్ మోగిస్తారు..? ఈ ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానం తెలుసుకుందాం. రైలు ఇంజ‌న్‌లో కూర్చున్న డ్రైవ‌ర్ అన‌వ‌స‌రంగా రైలు హార‌న్ మోగిస్తూనే ఉంటాడ‌ని మ‌నం అనుకుంటాం. కానీ అది నిజం కాదు. రైలు డ్రైవ‌ర్లు ఎవ్వ‌రినీ వేదించే ఉద్దేశంతో హార‌న్ మోగించ‌రు. రైలులో డ్రైవ‌ర్ హార‌న్ మోగించిన‌ప్పుడ‌ల్లా ఒక అర్థం ఉంటుంది. అవి ఏమిటో తెలుసుకుందాం.

How many types of train horn are there in Indian Railways? What is their  meaning? - Quora
ఒక చిన్న హార‌న్

Advertisement

డ్రైవ‌ర్ చిన్న‌గా విజిల్ ఊదిన‌ప్పుడు అత‌నికి ఇత‌ర ఇంజ‌న్ల నుంచి ఎటువంటి స‌హాయం అవ‌స‌రం లేద‌ని అర్థం.

రెండు చిన్న హార‌న్లు

డ్రైవ‌ర్ చిన్న‌గా విజిల్ ఊదిన‌ప్పుడు అత‌ను రైలును ప్రారంభించే ముందు వెనుక కంపార్టుమెంట్‌లో కూర్చున్న గార్డు నుంచి సిగ్న‌ల్ అడుగుతున్నాడ‌ని అర్థం.

మొద‌ట‌గా చిన్న‌గా, ఆ త‌రువాత గ‌ట్టిగా హార‌న్

రైలు డ్రైవ‌ర్‌కు వెనుక ఉన్న ఇంజిన్ నుంచి కొంత స‌హాయం కావాల‌ని అర్థం.

మొద‌ట పెద్ద‌గా, త‌రువాత చిన్న‌గా హార‌న్

రైలు డ్రైవ‌ర్ బ్రేక్ విడుద‌ల చేయ‌మ‌ని త‌న గార్డుకు సూచిస్తున్నాడు. దీంతో పాటు రైలు సైడింగ్‌లో తిరిగి వ‌చ్చినా త‌రువాత ప్ర‌ధాన లైన్ క్లియ‌ర్ చేయ‌బ‌డింద‌ని డ్రైవ‌ర్ సూచిస్తాడు.

మూడు చిన్న హారన్లు

ముందు మార్గం లేన‌ప్పుడు డ్రైవ‌ర్లు నాలుగు చిన్న విజిల్స్ వేస్తుంటారు. అన‌గా ఇంజన్ డ్రైవ‌ర్ ముందు వెనుక స్టేష‌న్‌తో మాట్లాడి స‌హాయం కోసం గార్డు నుంచి స‌హాయం కోరుతున్నాడు.

Advertisement

Indian Railways To Be World's First 100% Electric Railways With Zero Carbon  Emissions By 2030

నాలుగు చిన్న హార‌న్లు

ముందు మార్గం లేన‌ప్పుడు డ్రైవ‌ర్లు 4 చిన్న విజిల్స్ వేస్తారు. అన‌గా ఇంజ‌న్ డ్రైవ‌ర్ ముందు వెనుక స్టేష‌న్‌తో మాట్లాడి స‌హాయం కోసం గార్డు నుంచి స‌హాయం కోరుతున్నాడు.

మొద‌ట రెండు పెద్ద హార‌న్లు, త‌రువాత రెండు చిన్న హార‌న్లు

రైలు డ్రైవ‌ర్ గార్డును పిల‌వాల‌ని అనుకున్న‌ప్పుడు అటువంటి విజిల్ వేస్తాడు.

ఒక‌సారి చిన్న‌గా, కొద్దిసేపు హార‌న్ త‌రువాత చిన్న హార‌న్

ఇలాంటి హార‌న్ వినిపించిందంటే రైలు డ్రైవ‌ర్ టోకెన్ పొంద‌డం లేద‌ని, గార్డు నుంచి టోకెన్ డిమాండ్ చేస్తున్నాడ‌ని అర్థం.

సుదీర్ఘ‌మైన నిరంత‌ర హార‌న్

అటువంటి విజిల్ అంటే రైలు సొరంగం మార్గం గుండా వెళ్లుతుంద‌ని అర్థం. ఇది కాకుండా ఆ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ రైలు ఏదైనా చిన్న స్టేష‌న్‌లో ఆగాల్సిన అవ‌స‌రం లేదు. సంబంధిత స్టేష‌న్‌కు సిగ్న‌ల్ ఇస్తూ.. వేగంగా వెళ్లుతుంది. దీనిని త్రూ పాస్ అని అంటారు.

మొద‌ట చిన్న హార‌న్లు.. ఆ త‌రువాత ఒక పెద్ద హార‌న్

ప్ర‌యాణ స‌మ‌యంలో ఒక ప్ర‌యాణికులు చైన్ లాగుతున్న‌ప్పుడు రైలు కాపాలాదారుడు రైలును ఆప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు డ్రైవ‌ర్ అలాంటి హారన్ మోగిస్తాడు.

నిరంత‌రంగా చిన్న హార‌న్

రైలు డ్రైవ‌ర్ నిరంత‌రం చిన్న హార‌న్‌ వేస్తుంటే.. అత‌నికి స్ప‌స్ట‌మైన మార్గం క‌నిపించ‌డం లేద‌ని మున్ముందు ప్ర‌మాదం ఉండ‌వ‌చ్చు అని అర్థం. హారన్ వెనుక ఉన్న ఈ స‌మాధానాలు తెలియ‌డం వ‌ల్ల ప్ర‌యాణంలో రిలాక్స్‌గా ఉండ‌వ‌చ్చు.

Visitors Are Also Reading