భారతదేశం… ఎన్నో భిన్న సంస్కృతుల కు నిలయం. ఈ హిందూ దేశం అయినా భారతదేశం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. భారతదేశంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన జనాలు ఇక్కడ నివసిస్తున్నారు. అలాగే చాలా రకాల మతాలవారు కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే తాజాగా భారత్ కు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది.
read also : IPL 2023 : ధోని ఫ్యాన్స్ కు బిగ్ షాక్… కీపింగ్ పై కీలక నిర్ణయం!
Advertisement
చైనాను అధిగమించిన భారత్ లో ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023 పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పేర్కొన్నది. చైనా జనాభా 142.57 కోట్ల మంది అని తెలిపింది. 340 మిలియన్లతో అమెరికా మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. అయితే చైనాను భారత్ ఎప్పుడూ అధిగమించిందనే విషయాన్ని స్పష్టం చేయలేదు.
Advertisement
read also : Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తున్నది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు ఈ రెండు దేశాల్లోనే ఉన్నదని పేర్కొన్నది. అయితే చైనా జనాభా గతేడాది పీక్ కు చేరిందని, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని, ఇండియా జనాభా మాత్రం పెరుగుతోందని వెల్లడించింది. గత ఆరు దశాబ్దాలలో తొలిసారిగా 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదయింది. అయితే 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది.
read also : Samantha : “శాకుంతలం” ఫ్లాప్ వెనుక నాగచైతన్య…? ఇది స్కెచ్ అంటే