సాధారణంగా బిగ్ బాస్ సీజన్ వస్తుందంటే చాలు బుల్లితెర అభిమానులు పండుగ చేసుకుంటారు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసి సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తోంది. గత ఆరు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ఈ షో తాజాగా 7వ సీజన్ కి సిద్దమవుతుంది. సీజన్ 6 బిగ్ బాస్ షో అంతగా ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. దీంతో ఈసారి బిగ్ బాస్ అసలు జరుగుతుందా ? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇటీవలే ప్రోమోతో సీజన్ 7 ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
Advertisement
దీంతో ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ రియాలిటీ షో పైనే పడింది. ఈ షో ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్ బాస్ షోకి భారత మాజీ క్రికెటర్ వేణు గోపాలరావు ని తీసుకొస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కి ప్రధాన ఆకర్షణగా కంటెస్టెంట్స్ సీజన్ ఎప్పుడూ ప్రారంభం అయినా హౌస్ లోకి ఎవ్వరు వస్తారని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. మేకర్స్ కూడా ఆడియెన్స్ ని దృష్టిలో ఉంచుకొని కంటెస్టెంట్లను తెచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త వారిని అభిమానులకు పరిచయం చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. హౌస్ లోకి వచ్చేవారు మాత్రం ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మాజీ క్రికెటర్ వేణు గోపాలరావుని ఈ షోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇండియన్ క్రికెట్ టీమ్ తరుపున చోటు సంపాదించుకున్నటువంటి అతి తక్కువ తెలుగు క్రికెటర్లలో వేణు కూడా ఒకడు. తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ ఐపీఎల్ ద్వారా మంచి గుర్తింపు సంపదించుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉంటున్న ఈ క్రికెటర్ బిగ్ బాస్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
Advertisement
ప్రారంభం నుంచి 5 సీజన్ల వరకు మంచి రేటింగ్ తో దూసుకుపోయిన ఈ షో గత ఏడాది జరిగిన ఆరో సీజన్ మాత్రం కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇక ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేలా సీజన్ 7ని ప్లాన్ చేస్తున్నారు. అందుకే క్రికెటర్ వేణుగోపాలరావుని షో కి తీసుకొచ్చి కళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇన్ని రోజులు ప్రేక్షకులు ఆయనను ఒక ఆటగాడిగా మాత్రమే చూశాను.. ఒకవేళ హౌస్ లోకి వస్తే ఎలా ఉంటాడో అనే ఆసక్తి నెలకొంది. తెలుగు బిగ్ బాస్ లోకి ఫస్ట్ టైమ్ ఓ క్రికెటర్ ని చూడబోతున్నామన్నమాట. ఇప్పటికే బుల్లితెర సూపర్ స్టార్ ప్రభాకర్, విడాకులు తీసుకున్న ఓ జంట కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
RCB కెప్టెన్ గా కోహ్లీ.. మెంటల్ గా ABD.. మెక్కలమ్ కు కోచ్ ?
Samantha : సమంత చెప్పుల ఖరీదు అంతా.. ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!