Home » అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఇండియ‌న్ కంపెనీ 5 జీ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర ఎంతంటే ?

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఇండియ‌న్ కంపెనీ 5 జీ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర ఎంతంటే ?

by Anji
Ad

ప్ర‌స్తుతం టెక్నాల‌జీ పెరుగుతున్న నేప‌థ్యంలో మార్కెట్ లో 5 జీ ట్రెండ్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఐఫోన్, సాంసంగ్ ఇతర కంపెనీలు తమ యూజర్ల కోసం 5జీ అప్‌డేట్‌ విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ బ్రాండ్ అయినటువంటి లావా కంపెనీ చౌక అయినా 5జీ ఫోన్‌ రిలీజ్ చేసింది. ఈ సంస్థ లావా బ్లేజ్ 5జీ పేరుతో సరికొత్త ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో రన్ చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా 5000 mah బ్యాటరీ ఉంటుంది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధర 9,999 మాత్రమే. ఈ కామర్స్ సైట్ అయినటువంటి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Also Read : మీరు టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి..!

Advertisement

Manam

Advertisement

ఈ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. అయితే ఫోన్ సేల్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెన్సార్లు కూడా ఉన్నాయి. EIS సపోర్టెడ్ 50 ఎంపీ AI కెమెరా దీంట్లో హైలెట్. 2k వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యూటీ హెచ్‌డీఆర్, నైట్, ఫోర్ట్రైట్ మైక్రో, AI, ప్రో యు హెచ్ డి ఫిల్టర్స్ టైం లాప్స్ ,QR స్కానర్ వంటి కెమెరా ఫీచర్లను లావా అందిస్తుంది. గత నెలలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో లావా తొలిసారి బ్లేడ్ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రదర్శించింది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్ తో వస్తుంది.

Also Read : మాంసాహారం తిని దీపం పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే..!

Manam720×1600 HD+ రిజల్యూషన్ తో 6.51 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. ఫోన్ డిస్ ప్లే 90 HZ రీఫ్రెష్ కలిగి ఉంది. లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 700 ఆక్తాకోర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4జీజీ ర్యామ్, 128 బీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే ర్యామ్ ను 7జీజీ వరకు విస్తరించుకునే పర్సనల్ ర్యామ్ సపోర్టు ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.5000 mah బ్యాటరీనీ కలిగి ఉంటుంది. 50 గంటల టాక్ టైం అందజేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 165.3×76.4×8.9 mm కొలతలతో 207 గ్రాములు బరువును కలిగి ఉండబోతుంది.

Also Read : మధ్యాహ్నం భోజనం తరువాత మీకు నిద్ర వస్తుందా ? అయితే ఇలా చేయండి..!

 

Visitors Are Also Reading