Home » భారత్‌ ఎప్పుడూ ఓ దేశం కాదు.. డీఎంకే ఎంపీ సెన్షేషనల్ కామెంట్స్ ..!

భారత్‌ ఎప్పుడూ ఓ దేశం కాదు.. డీఎంకే ఎంపీ సెన్షేషనల్ కామెంట్స్ ..!

by Anji
Ad

భారతదేశంపై డీఎంకే ఎంపీ ఏ రాజా చేసిన మరోసారి వివాదస్పదమయ్యాయి. భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారత్‌.. ఎప్పుడూ కూడా ఓ దేశం కాదని ఇది ఒక ఉపఖండం అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుబడింది. రాముడి గురించి కూడా ఎంపీ రాజా తప్పుగా వ్యాఖ్యానించారని.. వెంటనే ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తింది. అయితే రాజా చేసిన వ్యాఖ్యలతో ఏకిభవించడం లేదని.. వాటిని ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రకటించింది.

Advertisement

Advertisement

 భారత్‌ ఎప్పుడూ ఒక దేశంగా లేదు. ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలు ఉంటేనే ఒకే దేశమని పిలుస్తారు. కానీ భారత్‌లో విభిన్న భాషలు, సంస్కృతిలున్న రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. అందుకే భారత్‌ ఒక దేశం కాదు.. ఉపఖండం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని’ ఎంపీ రాజా అన్నారు. డీఎంకే నుంచి మళ్లీ విద్వేష ప్రసంగాలు వస్తున్నాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ముగియకముందే.. మళ్లీ అలాంటి తరహాలోనే మాట్లాడటం శోచనీయం అంటూ ధ్వజమెత్తింది.

మరోవైపు ఎంపీ రాజా చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై.. కాంగ్రెస్‌, ఇండియా కూటమి పక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలతో వందశాతం ఏకీభవించడం లేదని.. వాటిని ఖండిస్తున్నామని తెలిపారు. ఎవరైన ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించారు.

Also Read : టీలో చక్కెరతో పాటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Visitors Are Also Reading