Home » ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా కంటే భారత్ బెస్ట్..!

ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా కంటే భారత్ బెస్ట్..!

by Anji
Ad

ప్రపంచ ఆర్థికాభివృద్ధి వచ్చే వార్షిక సంవత్సరం మరింత బలహీనంగా మారే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)  ఓ అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)  మంగళవారం వరల్డ్ ఎకానమిక్ ఔట్ లుక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ వృద్ధి 2022లో 3.4% ఉండగా.. 2023లో అది 2.9 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. 2024లో మళ్లీ 3.1 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉన్నదని.. పుంజుకునేందుకు కొంచెం సమయం పడుతుంది అని పేర్కొన్నది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 6.8% ఉండగా.. 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం చాలా ముందుందని.. 24 ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

 

Indian economy to grow 7-8% in next two decades: NITI Aayog Vice Chairman  Arvind Panagariya | Deccan Herald
ఐఎంఎఫ్ అంచనా ప్రకారం.. “అక్టోబర్ ఔట్ లుక్ తో పోల్చితే భారతదేశానికి సంబంధించి మా వృద్ధి అంచనాలు మారలేదు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మేము 6.8% వృద్ధిని కలిగి ఉన్నాం. ఈ వృద్ధి మార్చి వరకు కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023లో 6.1 శాతం గా కొంత మందగమనాన్ని మేము ఆశిస్తున్నాం” అని చీప్ ఎకానమిస్ట్ ఐఎంఎఫ్ పరిశోధన విభాగం డైరెక్టర్ ఫియర్ ఒలివియర్ గౌరించాస్ పేర్కొన్నారు.. భారతదేశంలో వృద్ధిరేటు 2022లో 6.8% ఉండగా.. 2023లో 6.1 శాతానికి క్షీణిస్తుంది. 2024 లో 6.8 శాతానికి చేరుకుంటుంది. బాహ్య ప్రకంపనలు ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా, బ్రిటన్, చైనా దేశాలతో పోల్చితే భారత్ వృద్ధిలో ముందంజలో ఉన్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల్లో భారత్ అగ్ర భాగాన ఉందని ఇలాగే మున్ముందు కూడా కొనసాగుతుందని పేర్కొంది.
ప్రస్తుతం అంచనా ప్రకారం.. చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొంది. కరోనా సడలింపుల మధ్య 2023లో చైనాలో వృద్ధి 5.2 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2024లో 4.5 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. 2023లో ప్రపంచ వృద్ధిలో చైనా భారత్ దాదాపు సగం వాటాన్ని కలిగి ఉన్నాయి. ఆసియాలో వృద్ధిరేటు 4.3 శాతం నుంచి 5.3 శాతానికి పెరిగిందని పేర్కొంది. అక్టోబర్ 2022 వరల్డ్ ఎకానమిక్ లో అంచనా వేసిన దానికంటే 2023 లో అంచనా 2 శాతం ఎక్కువగా ఉందని.. 3.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యల్బణంపై  పోరాడేందుకు సెంట్రల్ బ్యాంకు రేట్లు పెరగడంలో రష్యా యుద్ధము ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి.. మరోవైపు చైనాలో కరోనా వ్యాప్తి కారణంగా 2022లో వృత్తి తగ్గిందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచ ద్రవ్యోల్బణం   2022లో 8.8% నుంచి 2023లో 6.6%.. 2024లో 4.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక ఇప్పటికీ కరోనా మహమ్మారి కంటే ముందు ఉన్న వృత్తి కంటే దావత్ 3.5% కంటే ఎక్కువ ఉన్నట్టు పేర్కొంది.

Advertisement

Visitors Are Also Reading