Home » పాకిస్థాన్ చేసిన అదే తప్పు ఇండియా చేస్తుందా…?

పాకిస్థాన్ చేసిన అదే తప్పు ఇండియా చేస్తుందా…?

by Azhar
Ad

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై కొన్ని రోజులుగా విమర్శలు అనేవి పెరుగుతున్నాయి. అయితే వరుసగా సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ అనేది ఇస్తున్న బీసీసీఐ.. కెప్టెన్లను కూడా విపరీతంగా మారుస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది మన జట్టుకు 8 మంది కెప్టెన్ లుగా పని చేసారు. అయితే గత ఏడాది 2021 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోగా.. ఆ స్థానంలోకి రోహిత్ వచ్చాడు.

Advertisement

కానీ రోహిత్ ను అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంచడకుండా సెలక్టర్లు కెప్టెన్లను మారుస్తూనే ఉన్నారు. అయితే దీనిపై చాలానే విమర్శలు అనేవి వస్తున్నాయి. అయితే పాకిస్థాన్ ఆటగాడు రషీద్ లతీఫ్ మాత్రం పాకిస్థాన్ 1990 ల్లో చేసిన తప్పునే ఇప్పుడు భారత్ కూడా చేస్తుంది అని పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం బీసీసీఐపై వస్తున్న విమర్శల నేపథ్యంలో వాటిపై రషీద్ లతీఫ్ స్పందించారు.

Advertisement

ఆయన మాట్లాడుతూ… ఒక్క స్థిరమైన కెప్టెన్ యూ ఆడించే విషయంలో 1990 లో పాకిస్థాన్ చేసిన అదే తప్పును ఇప్పుడు ఇండియాకు చేస్తుంది. వరుసగా కెప్టెన్ లను మారుస్తూ వెళ్తుంది. 1990 లో పాకిస్థాన్ కూడా ఇలాంటి తప్పే చేసింది. ఘోరంగా విఫలం అయ్యింది. అయితే ప్రతి ఒక్కరు బ్యాకప్ కెప్టెన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతమందిని కెప్టెన్సీకి టీం ఇండియా ప్రయత్నించడం ఇదే తొలిసారి. అయినా కూడా వారిలో ఎవరు సరైన కెప్టెన్ కాలేరని… ఇండియాకు రోహిత్ తర్వాత కెప్టెన్సీ చేసే బలమైన ప్లేయర్ ఇంకా దొరకలేదు. వారికీ గంగూలీ, ధోని, కోహ్లీ వంటి కెప్టెన్ అవసారం ఇప్పుడు ఉంది అని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కంటే దినేష్ గ్రేట్.. ఎలా అంటే..?

భారత ప్లేయర్స్ కిట్స్ ఆలస్యం.. మ్యాచ్ కూడా..?

Visitors Are Also Reading